జీ సినిమాలు రెట్రో: బొబ్బిలి రాజా జ్ఞాపకాలు

Friday,September 14,2018 - 05:06 by Z_CLU

బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టడం వెంకీ హాబీ. అందుకే అభిమానులు ముద్దుగా విక్టరీ వెంకటేష్ అని పిలుచుకుంటారు. 80శాతానికి పైగా సక్సెస్ రేట్ ఉన్న వెంకీ కెరీర్ లో మరపురాని చిత్రాలు కొన్ని ఉన్నాయి. వాటిలో ఒకటి బొబ్బలి రాజా. 1990లో సరిగ్గా ఇదే రోజు (సెప్టెంబర్ 14)న విడుదలైన ఈ సినిమా 28 ఏళ్లు పూర్తిచేసుకుంది.

ఆ ఏడాది అగ్గిరాముడు పేరుతో అప్పటికే ఓ హిట్ ఇచ్చాడు వెంకటేష్. కానీ బొబ్బిలి రాజా మాత్రం మాములు హిట్ కాదు. బి.గోపాల్, వెంకీ కాంబోలో వచ్చిన ఈ సినిమా ఆ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఏకంగా 3 సెంటర్లలో 175 రోజులు నాన్-స్టాప్ గా ఆడింది. అలా వెంకీ కెరీర్ లో మొట్టమొదటి సిల్వర్ జూబ్లీ సినిమాగా నిలిచింది బొబ్బలిరాజా.

వెంకీ యాక్షన్, గోపాల్ డైరక్షన్ ఒకెత్తయితే.. ఇళయరాజా సంగీతం ఈ సినిమాను మ్యూజికల్ హిట్ గా కూడా మార్చేసింది. ఈ సినిమాలో పాటలు ఇప్పటికీ హిట్టే. ఈ సినిమాకు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ సినిమాలో ఓ పాటను గ్రాఫిక్స్ మీద నడిపించారు. అప్పట్లో అది చాలా పెద్ద విషయం.