ఆది పినిశెట్టి ఇంటర్వ్యూ

Friday,September 14,2018 - 03:33 by Z_CLU

నిన్న రిలీజైన ‘యూటర్న్’ సినిమాకి ఓవరాల్ గా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఓకే ఐమ్పర్తెంట్ మెసేజ్ ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో మిక్స్ చేసి చెప్పిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి, ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆది పినిశెట్టి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకున్నాడు. అవి మీకోసం…

అందుకే చేశాను…

ఈ సినిమాలో నేనెంత సేపు కనిపిస్తాను లాంటివి పక్కన పెడితే, ఒక మంచి సినిమాలో నేను పార్ట్ అవుతాను అన్న ఫీల్ తో ఈ సినిమా చేశాను…

అదే సినిమా…

మన కర్మ మనలని వెంటాడుతుంది అంటాం కదా.. అదే ‘యూటర్న్’ సినిమా. ఎవరూ చూడట్లేదు కదా అని కొన్ని  తప్పులు చేస్తుంటాం. ఎవరూ రావట్లేదు కదా అని ట్రాఫిక్ సిగ్నల్స్ దాటేస్తుంటాం… అలా మనం చేసిన తప్పే మనల్ని ఎలా చుట్టుకుంటుంది అనేది ఈ సినిమాలో చూస్తారు…

సమంతా తో…

సినిమాలో చూడటం వేరు. సెట్స్ పై పని చేయడం వేరు… సమంతా నాకు రంగస్థలం కన్నా ముందే తెలిసినా, కలిసి పని చేసేటప్పుడు ఎగ్జాక్ట్ గా తనేంటనేది తెలిసింది. తనతో పని చేయడం చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది.

ముందే ఫిక్స్ అయ్యా…

పవన్ కుమార్ చేసిన సినిమాలు చూస్తే, తను ఈ జెనెరేషన్ డైరెక్టర్ కాదనిపిస్తుంది. నెక్స్ట్ జెనెరేషన్ డైరెక్టర్. అంత బియాండ్ గా ఆలోచిస్తాడు… ఈ సినిమాకి ఎవరు పని చేసినా పవన్ కోసమే చేశాం.

అదే మా లైఫ్…

యాక్టర్స్, కానీ రైటర్స్ కానీ, ఫిలిమ్ మేకర్స్ కానీ రియల్ లైఫ్ కన్నా, ఇమాజినేషన్ లోనే బ్రతికేస్తుంటాం. నా వరకు నేనొక సినిమాలో నటిస్తున్నానంటే, నాది కాని ఒక క్యారెక్టర్ ని బ్రతికేస్తుంటా… అదే మా లైఫ్… ఆ లెక్కన నా లైఫ్ లో ప్రతి క్షణం థ్రిల్లింగ్ గానే ఉంటుంది.

అది సూపర్ హిట్టే…

థ్రిల్లర్ అంటే.. సినిమా చూస్తున్నంత సేపు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీని జెనెరేట్ చేయడం. ఆ ఫీల్ ని ఆడియెన్స్ లో అట్లీస్ట్ ఫస్టాఫ్ వరకైనా హోల్డ్ చేయగలిగామంటే ఆ సినిమా సూపర్ హిట్టే.

కమర్షియల్ సినిమా…

నా దృష్టిలో కమర్షియల్ సినిమా అంటే, నా ప్రొడ్యూసర్ పెట్టే ప్రతి రూపాయి వెనక్కి రావడం. అలా జరిగిందంటే అది కమర్షియల్ గా సక్సెస్ ఫుల్ సినిమానే.

కథ కన్నా…

సినిమాలో నా క్యారెక్టర్ కన్నా ముందు కథ గురించే ఎక్కువ ఆలోచిస్తా.. కథ కన్నా ముందు నేను పని చేసే టీమ్ గురించి ఆలోచిస్తా… కథ తరవాత సినిమా సక్సెస్ కి రీజన్ అయ్యేది టీమే. టీమ్ లో ఒక్క రాంగ్ పర్సన్ ఉన్నా సినిమా ట్రాక్ తప్పుతుంది.

నేను హీరోగా…

నేను హీరోగా చేసే సినిమాలను ఇంకా జాగ్రత్తగా చేసుకుంటా… ఆడియెన్స్ స్టాండర్డ్స్ చాలా పెరిగిపోయాయి. నా గత సినిమాల్లో చేసిన తప్పులు మళ్ళీ రిపీట్ చేయకుండా, సినిమాలు చేస్తా.

చాలా మార్పు…

సొసైటీలో విమెన్ ని ట్రీట్ చేసే పద్ధతి మారింది. గతంలో ఇలా  ఉండేది కాదు. ఆ మార్పు ఇప్పుడు సినిమాల్లో కూడా కనిపిస్తుంది. చాలా ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు వస్తున్నాయి. అలాంటి సినిమాల్లో సపోర్టింగ్ చేయడమన్నా నాకిష్టమే.

బ్యాలన్స్ చేయాలి…

RX 100 రీమేక్, తో పటు మరో 3 కథలు రెడీగా ఉన్నాయి. ఏది ఫస్ట్ చేస్తానో ప్రస్తుతానికి నాక్కూడా తెలీదు. కొత్త జోనర్ సినిమాలు చేస్తూనే, కమర్షియల్ చేయాలి అనుకుంటున్నా… 2 బ్యాలన్స్ చేస్తూ చేయాలి సినిమాలు.

బెటర్ RX 100…

RX 100 సినిమాలో కొన్ని చేంజెస్ చేస్తున్నాం. ముఖ్యంగా శివ బ్యాక్ డ్రాప్ ఒకటి మారుస్తున్నాం… ఆ స్క్రిప్ట్ ని చేంజ్ చేస్తే, సెన్సిబిలిటీస్ మిస్ అవుతాం. అందుకే స్క్రిప్ట్ ని మార్చకుండానే ఇంకా అడిషనల్ గా ఎట్రాక్టివ్ ఎలిమెంట్స్ ఆడ్ చేస్తున్నాం… నాకు సినిమాలో శివ క్యారెక్టర్ చాలా నచ్చింది. అందుకే సినిమా చేస్తున్నా.