‘సవ్యసాచి’ లో సుభద్ర పరిణయం

Thursday,November 01,2018 - 11:15 by Z_CLU

నాగచైతన్య ‘సవ్యసాచి’ రేపే రిలీజవుతుంది. ఈ సందర్భంగా సినిమాలో హిలేరియస్ ఎలిమెంట్ గా హైలెట్ కానున్న ‘సుభద్ర పరిణయం’ నాటకం టీజర్ రిలీజ్ చేశారు ఫిల్మ్ మేకర్స్. ఇప్పటి వరకు సినిమాలోని ఇమోషనల్, యాక్షన్ ఆంగిల్ ఎలివేట్ చేసిన ‘సవ్యసాచి’ టీమ్, సినిమాలో కామెడీ కూడా ఉండబోతుందని ఈ టీజర్ తో ఫుల్ క్లారిటీ ఇచ్చింది. 

కాలేజ్ లో కల్చరల్ ప్రోగ్రామ్స్ సందర్భంలో ఉండబోయే ఈ నాటకంలో నాగచైతన్య అర్జునుడిలా కనిపించనున్నాడు. చైతుకు తోడు హైపర్ ఆది, విద్యుల్లేఖ, వెన్నెల కిషోర్ కాంబినేషన్ లో ఉండబోయే ఈ సుభద్ర పరిణయం నాటకం, సినిమాలో కావాల్సినంత కామెడీ జెనెరేట్ చేయడం గ్యారంటీ అని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్.

చందూ మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కింది సవ్యసాచి. ఈ సినిమాలో చైతు సరసన నిధి అగర్వాల్ నటించింది. కీరవాణి మ్యూజిక్ కంపోజర్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై సవ్యసాచి తెరకెక్కింది.