నవంబర్ రిలీజ్

Tuesday,October 30,2018 - 01:07 by Z_CLU

దసరా కానుకగా రిలీజైన అరవింద సమేత సినిమా అక్టోబర్ మంత్ ని మరింత స్పెషల్ గా మార్చేసింది. ఈ సినిమా తో పాటు ఈ నెలలో రిలీజైన ‘పందెం కోడి’, ‘హలో గురూ ప్రేమ కోసమే’ సినిమాలు కూడా తమ తమ స్థాయిలో బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ మార్క్ ని క్రియేట్ చేసుకున్నాయి. అయితే ఈ లోపు నెక్స్ట్ మంత్ రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాలు  ప్రమోషన్స్ తో అప్పుడే కాన్సంట్రేషన్ ని గ్రాబ్ చేస్తున్నాయి.

 

నవంబర్ 2 న రిలీజవుతుంది నాగచైతన్య సవ్యసాచి. డిఫెరెంట్ కాన్సెప్ట్ తో ఇమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా,ఇప్పటికే సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా జ్యూక్ బాక్స్, సవ్యసాచి స్టాండర్డ్స్ ని ఎలివేట్ చేస్తుంది.

సెకండ్ వీకెండ్ వరసగా 3 సినిమాలతో ఫిక్సయింది. నవంబర్ 6 న విజయ్, కీర్తి సురేష్ ల ‘సర్కార్’ రిలీజవుతుంటే ఇమ్మీడియట్ గా 7 న, రవిబాబు డైరెక్షన్ లో తెరకెక్కిన ‘అదుగో’, 8 న నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన ‘ముద్ర’ రిలీజవుతుంది.

ఇక థర్డ్ వీకెండ్ 4 సినిమాలతో ఎంటర్ టైన్ చేయనుంది. నవంబర్ 15 న హెబ్బా పటేల్, ఆదిత్ అరుణ్ జంటగా నటించిన 24 కిస్సెస్ రిలీజవుతుంది. నవంబర్ 16 న విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’ తో పాటు రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మరింత జోష్ నింపనున్నాయి. ఈ 3 సినిమాలతో పాటు ‘హుషారు’ సినిమా కూడా అదే రోజు రిలీజవుతుంది.

ధనుంజయ్, ఇర్రా మిర్రర్ జంటగా నటించిన ‘భైరవగీత’ నవంబర్ 22 న రిలీజవుతుంది. సిద్ధార్థ్ తాతోలు డైరెక్షన్ లో తెరకెక్కింది ఈ సినిమా. ప్రస్తుతానికి ఈ  వీక్ లో రిలీజ్ డేట్ ని లాక్ చేసుకున్న సినిమా ఇదొక్కటే.

మోస్ట్ అవేటెడ్ వీకెండ్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఫీస్ట్ లాంటి వీకెండ్ ఇది. రజినీకాంత్ 2.0 ఈ వీకెండ్ కే రిలీజవుతుంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ బిగ్గెస్ట్ మ్యాగ్నం ఓపస్ నవంబర్ 29 న థియేటర్స్ లోకి రానుంది.