నాగచైతన్య ఇంటర్వ్యూ

Thursday,November 01,2018 - 04:52 by Z_CLU

నాగచైతన్య ‘సవ్యసాచి’ రేపు గ్రాండ్ గా రిలీజవుతుంది. ఈ సినిమాలో వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ ఉన్న కుర్రాడిలా కనిపించనున్నాడు చైతు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నాగ చైతన్య ఈ సినిమాతో పాటు తన నెక్స్ట్ సినిమా విషయాలు కూడా డిస్కస్ చేశాడు అవి మీకోసం…

అప్పుడే చెప్పాడు…

ప్రేమమ్ చేస్తున్నప్పుడే చందూ ఈ సినిమా లైన్ చెప్పాడు. కానీ విన్నప్పుడు అంత ఎగ్జైట్ మెంట్ లేదు. ఎక్కడో ఎక్స్ పెరిమెంట్ లాగే అనిపించింది. కానీ ఎపుడైతే కంప్లీట్ స్టోరీ, కమర్షియల్ ఎలిమెంట్స్ ని కూడా బ్లెండ్ చేసి చెప్పాడో… విన్నప్పుడే చాలా హ్యాప్పీగా అనిపించింది.

న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్…

ప్రేమమ్ చేసినప్పుడే చందూ స్టాండర్డ్స్ నాకు తెలుసు. సవ్యసాచి విషయంలో కూడా బిగినింగ్ లో ఎక్కడో కొంచెం భయం ఉన్నా, ఫస్ట్ షెడ్యూల్ తరవాత ఎప్పుడైతే రషెస్ చూశానో, కాన్ఫిడెన్స్ వచ్చేసింది.

నేను కూడా తెలుసుకున్నా…

ఎప్పుడైతే చందూ ఈ వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ గురించి చెప్పాడో నేను కూడా వాటికి సంబంధించిన ఆర్టికల్స్ చదివాను. గూగుల్ లో కూడా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంది. రియల్ లైఫ్ లో నిజంగానే ఈ సిండ్రోమ్ ఉంది.

నో రిఫరెన్స్…

నాన్నగారి ‘హలో బ్రదర్స్’ నుండి రిఫరెన్స్ తీసుకోవడం లాంటివే ఏమీ జరగలేదు. ఆ సినిమాలో ట్విన్స్, ఈ సినిమాలో ట్విన్స్ ఇద్దరూ ఒకే బాడీలో ఉంటారు. అదొక్కటే తప్ప ఎక్కడా ఆ సినిమాకి, ఈ సినిమాకి సిమిలారిటీస్ ఉండవు. సవ్యసాచి కంప్లీట్ గా డిఫెరెంట్ గా సినిమా.

నేను నా డ్యాన్స్…

ప్రతి ఒక్కరికి ఒక పర్టికులర్ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. నా బాడీ లాంగ్వేజ్ ని అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా స్టెప్స్ కంపోజ్ చేశారు శేఖర్ మాస్టర్. లగ్గాయిత్తు సాంగ్ లో నేను బాగా డ్యాన్స్ చేశానంటే క్రెడిట్ ఆయనకే దక్కుతుంది.

నాన్నగారి సజెషన్స్…

నాన్నగారు కరియర్ బిగినింగ్ లో స్క్రిప్ట్స్ వినేవారు కానీ ఇప్పుడు ఆ ఫ్రీడమ్ నాకే ఇచ్చేశారు. సవ్యసాచి సినిమా చూశారు 3 మంత్స్ బ్యాక్… కొన్ని సజెషన్స్ చేశారు, దానికి తగ్గట్టు మేము కూడా ఇంప్లిమెంట్ చేశాం…

మేమనుకున్నది ఇది కాదు…

మేమసలు ‘సవ్యసాచి’ ని ఇంత వైడ్ స్కేల్ లో చేద్దామని అసలు అనుకోలేదు. ప్రొడ్యూసర్స్ ఇందులో ఇన్వాల్వ్ అయి, ఈ పాయింట్ చాలా వాలిడ్. దీన్ని ఇంకా బాగా ప్లాన్ చేయండి అని చెప్పారు. అప్పుడు సినిమాలో మాధవన్ గారు, భూమిక గారు ఆడ్ అయ్యారు.

ఫస్టాఫ్ – సెకండాఫ్

ఫస్టాఫ్ మొత్తం చాలా ఫన్ ఉంటుంది, సినిమాలో క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ అవుతుంటాయి దానితో పాటు ఈ వానిషింగ్ సిండ్రోమ్ గురించి చెప్తూ.. చాలా ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది. సెకండాఫ్ లో నేను, మాధవన్ కాంబినేషన్ లో అవుట్ స్టాండింగ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి.

నా మాటే వినదు…

నా లెఫ్ట్ హ్యాండ్ నా మాటే వినదు. దాని వల్ల నా హ్యాండ్ తో నాకే ఫైట్ ఉంటుంది ఫస్టాఫ్ లో. ఎప్పుడైతే సెకండాఫ్ లో చాలెంజింగ్ ఎలిమెంట్స్ బిగిన్ అవుతాయో, అప్పుడు ఇద్దరు కలిసి ఎలా ఫైట్ చేస్తారు అనేది సినిమా.

మాధవన్ గురించి…

మాధవన్ ఎప్పుడూ ట్రెండ్ సెట్టరే… అప్పుడు ‘సఖి’ లాంటి సినిమాలు చేసినా, ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాలు గమనించినా.. ప్రతీది ఇన్స్ పిరేషనే… ఆయన దగ్గర చాలా నేర్చుకోవచ్చు.

ప్రొడ్యూసర్స్ గురించి…

ఆక్చువల్ గా ఈ సినిమాను రెగ్యులర్ సినిమాల్లాగే ప్లాన్డ్ బడ్జెట్ లో చేసేయొచ్చు. కానీ అలా చేయకుండా ఇంత గ్రాండియర్ గా ప్యాక్డ్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా చేశారు. వాళ్ళ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

లైఫ్ లాంగ్…

నా కరియర్ లో ఫస్ట్ టైమ్ ఒక సినిమా హిట్టయిన తరవాత మళ్ళీ వచ్చి ఇంకో సినిమా చేద్దాం అని అడగడం, నాకు ప్రేమమ్ లాంటి హిట్టిచ్చిన చందూ, లైఫ్ లాంగ్ నాకు గుర్తుండిపోతాడు. ఈ సినిమా హిట్టయి, ఇంకో సినిమా చేద్దామన్నా నేను రెడీ…

కొత్త సినిమాలో…

శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్నది కూడా వండర్ ఫుల్ స్క్రిప్ట్. సినిమాలో మేమిద్దరం మ్యారీడ్ కపుల్ అయినా, అది వేరే స్టోరీ. స్క్రిప్ట్ లో చాలా గొడవలుంటాయి. మాకు రియల్ లైఫ్ లో అలాంటివి లేవు కాబట్టి కొంచెం కష్టంగా ఉంది ( నవ్వుతూ…)

శివ నిర్వాణ గురించి…

చాలా ట్యాలెంటెడ్ డైరెక్టర్. ఈ స్క్రిప్ట్ ని కూడా అందరూ కనెక్ట్ అయ్యేలా డిజైన్ చేశాడు. రియలిస్టిక్ ప్రాబ్లమ్స్ ఎలివేట్ అయ్యే బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. మ్యాగ్జిమం ఫిబ్రవరిలో సినిమా కంప్లీట్ అయితే సమ్మర్ రిలీజ్ కి ప్లాన్ చేస్తాం.

వెంకీ మామ…

ఈ సినిమా డిసెంబర్ లో స్టార్ట్ అవుతుంది.

ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ…

నాకు ఆయనంటే చాలా ఇష్టం. ఈ సినిమాలో మాధవన్ మెజిస్టిక్ హౌజ్ సెట్ కానీ,  నా ఆఫీస్ సెట్ కానీ, అంతెందుకు వరుణ్ తేజ్ ‘అంతరిక్షం’ సినిమాకి కూడా ఆయనే పనిచేశారు. ఆ సెట్స్ చూశాను నేను. జస్ట్ మైండ్ బ్లోయింగ్. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అలాంటి టెక్నీషియన్ ఉండటం మన అదృష్టం.

పెళ్ళికి ముందు – పెళ్ళికి తరవాత

పెళ్ళి తర్వాత కంప్లీట్ అయ్యాననిపిస్తుంది. బ్యాలన్స్ వచ్చింది. సండేస్ టైం స్పెండ్ చేస్తుంటాం. షూటింగ్ ఉన్నప్పుడు కూడా సింగిల్ కాల్షీట్ లో వర్క్ కంప్లీట్ చేసుకుని కలిసి ఉండటానికే ట్రై చేస్తాం. ఇప్పుడైతే కలిసి సినిమా చేస్తున్నాం కాబట్టి చాలా టైమ్ దొరుకుతుంది.