షూటింగ్ అప్ డేట్స్

Thursday,November 01,2018 - 11:02 by Z_CLU

సైరా నరసింహ రెడ్డి

మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ ఎవైటింగ్ మూవీ ‘సైరా నరసింహ రెడ్డి’ షూటింగ్ ప్రస్తుతం జార్జియాలో జరుగుతుంది. ప్రస్తుతం అక్కడ ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ను షూట్ చేస్తున్నారు యూనిట్. ఈ వార్ ఎపిసోడ్ ను గ్రెగ్ పావెల్ నేతృత్వంలో గ్రాండియర్ గా తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈ షెడ్యుల్ ఫినిష్ చేసుకొని హైదరాబాద్ రానున్నారు. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. అమిత్ త్రివేది ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.


ప్రభాస్ -రాధా కృష్ణ మూవీ

జిల్ ఫేం రాధా కృష్ణ డైరెక్షన్ లో ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ షూటింగ్ యూరప్ లో జరుగుతుంది. ప్రస్తుతం ప్రభాస్ , పూజా హెగ్డే పై కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ తో పాటు సాంగ్స్ కూడా షూట్ చేస్తున్నారు. కంప్లీట్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను గోపి కృష్ణ మూవీస్ , యూ.వి.క్రియేషన్స్ బ్యానర్స్ పై కృష్ణం రాజు, వంశీ , ప్రమోద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


మహర్షి

మహేష్ – వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘మహర్షి’ ఇటివలే హైదరాబాద్ లో ఓ షెడ్యుల్ ఫినిష్ చేసుకుంది. ప్రస్తుతం యూ.ఎస్ లో షూటింగ్ జరుపుకుంటుంది. యూ.ఎస్ లో లాంగ్ షెడ్యుల్ ఫినిష్ చేసి హైదరాబాద్ లో మరో షెడ్యుల్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఆర్.ఎఫ్.సి లో ఓ భారీ సెట్ రెడీ చేస్తున్నారు. మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఏప్రిల్ 5న సినిమా థియేటర్స్ లోకి రానుంది.


RC12

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను క్రేజీ కాంబినేష‌న్‌లో భారీ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకున్న ఈ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజి కి చేరుకుంది. రెండు పాట‌లు మిన‌హా న‌వంబ‌ర్ 10 కల్లా షూటింగ్ మొత్తం పూర్త‌వుతుంది. న‌వంబ‌ర్ 9 నుండే డ‌బ్బింగ్ ప్రారంభించనున్నారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి 2019 సంక్రాంతి కానుక‌గా ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుద‌ల చేయనున్నారు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియ‌రా అద్వాని హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమాలో ప్ర‌శాంత్‌, ఆర్య‌న్ రాజేశ్‌, స్నేహ, వివేక్ ఒబెరాయ్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజర్.


‘F2’

వెంకటేష్ -వరుణ్ తేజ్ కాంబోలో తెరకెక్కుతున్న ‘F2’షూటింగ్ ప్రెజెంట్ థాయిలాండ్ లో జరుగుతుంది. వెంకటేష్ , వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ లతో పాటు మరికొందరు ఆర్టిస్టుల మీద కొన్ని కీలకమైన సీన్స్ షూట్ చేస్తున్నారు. ఈ షెడ్యుల్ తో ఆల్మోస్ట్ షూటింగ్ ఫినిష్ కానుందని సమాచారం. అనిల్ రావి పూడి డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరిలో రిలీజ్ కానుంది.

మిస్టర్ మజ్ను

అఖిల్ Mr.మజ్ను సక్సెస్ ఫుల్ గా టాకీపార్ట్ కంప్లీట్ చేసుకుంది. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా సాంగ్స్ మినహా షూటింగ్ ఫినిష్ చేసుకుంది.. ప్రస్తుతానికి మిగిలిన పోర్షన్ కూడా కంప్లీట్ చేసేసి ఫుల్ ఫోకస్ పోస్ట్ ప్రొడక్షన్ పై పెట్టే ప్రాసెస్ లో ఉంది టీమ్. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ పై భోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 14 న వాలెంటైన్స్ డే సందర్భంగా సినిమా రిలీజ్ కానుంది.


జెర్సీ

నాచురల్ స్టార్ నాని నటిస్తున్న క్రికెట్ బేస్డ్ మూవీ ‘జెర్సీ’ అక్టోబర్ 17 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయింది . ప్రస్తుతం హైదరాబాద్ లో నాని శ్రద్దా శ్రీనాథ్ లపై కొన్ని సీన్స్ షూట్ చేస్తున్నారు. బ్రేక్ లేకుండా కంటిన్యూ గా షూట్ ఫినిష్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మించనున్న ఈ సినిమాకు గౌతం తిన్ననూరి డైరెక్టర్. అనిరుద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.


యాత్ర

Y.S.రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా తెరకెక్కుతున్న ‘యాత్ర’సక్సెస్ ఫుల్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ప్యాచ్ వర్క్ మినహా టోటల్ షూటింగ్ పూర్తిచేసేసారు మేకర్స్. మమ్మూట్టీ రాజశేఖర్ రెడ్డి గారి పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు మహి వి రాఘవ్ దర్శకుడు. 70 ఎం ఎం ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై విజయ్ , శశి నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 21 న రిలీజ్ కానుంది.

కల్కి

డా. రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘కల్కి’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో షూటింగ్ జరుపుకుంటుంది. 1980 బ్యాక్‌డ్రాప్‌ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అవుట్ స్క‌ర్ట్స్‌లో రెండు కోట్ల రూపాయ‌ల‌తో భారీ సెట్‌ వేసారు. ఆ సెట్ లోనే ప్రస్తుతం కొన్ని కీలకమైన సీన్స్ షూట్ చేస్తుంది యూనిట్. శివానీ శివాత్మిక మూవీస్ బ్యాన‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో హ్య‌పీ మూవీస్ ప‌తాకంపై రూపొంద‌నున్న ఈ చిత్రాకి సి.క‌ల్యాణ్‌, శివానీ రాజ‌శేఖ‌ర్‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్ నిర్మాత‌లు. రాజశేఖర్ సరసన ఆదాశ‌ర్మ‌, నందితాశ్వేత‌, స్కార్లెట్ విల్సన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అశుతోష్ రానా మరియు నాజర్ కీలక పాత్రలో నటిస్తున్నారు.