నాగచైతన్య సవ్యసాచి జ్యూక్ బాక్స్ రిలీజయింది

Friday,October 26,2018 - 03:33 by Z_CLU

సవ్యసాచి జ్యూక్ బాక్స్ రిలీజయింది. కీరవాణి మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాలో మొత్తం 7 సాంగ్స్ ఉన్నాయి. డిఫెరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమా ఇప్పటికే ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా, ఇప్పుడీ జ్యూక్ బాక్స్ తో సోషల్ మీడియాలో సినిమాపై మరిన్ని అంచనాలు క్రియేట్ చేస్తుంది.

సందర్భానుసారంగా ఉండబోయే ఈ 7 పాటల్లో వై నాట్, టిక్ టిక్ టిక్, 1980, 81,82 …  సాంగ్ తో పాటు నాగార్జున నిన్ను రోడ్డు మీద  చూసినాక సాంగ్స్ హీరో హీరోయిన్స్ కాంబినేషన్స్ లో ఉండబోతున్నాయి. ఈ 4 పాటల్లో నిన్ను రోడ్డు మీద చూసినాక స్పెషల్ గా నిలుస్తుంది. నాగార్జున సూపర్ హిట్ సినిమా ‘అల్లరి అల్లుడు’ లోని ఈ పాట ఇప్పుడు మరోసారి యూత్ ని మెస్మరైజ్ చేస్తుంది. ఈ సాంగ్ తో పాటు 1980,81,82 సాంగ్ 80 లలో ఇష్టపడి చేసిన పనులు మరోసారి గుర్తు చేస్తుంది.

4 సాంగ్స్ తో పాటు ఒక్కరంటే ఒకరు, ఊపిరి ఉక్కిరి బిక్కిరి, సవ్యసాచి సాంగ్స్ సినిమా మెయిన్ కాన్సెప్ట్ ని ఎలివేట్ చేస్తున్నాయి. కీరవాణి మార్క్ తో కంపోజ్ అయిన ఈ ఆల్బమ్ మ్యూజిక్ లవర్స్ కి పర్ఫెక్ట్ ప్యాకేజ్ అనిపించుకుంటుంది.

చందూ మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగచైతన్య సరసన నిధి అగర్వాల్ నటిస్తుంది. నవంబర్ 2 న రిలీజవుతున్న ఈ సినిమాలో భూమిక, మాధవన్ కీ రోల్స్ ప్లే చేస్తున్నారు.