నాగచైతన్య సినిమా కోసం బాహుబలి టీమ్

Sunday,June 17,2018 - 10:35 by Z_CLU

పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్  లో ఉంది నాగచైతన్య ‘సవ్యసాచి’ సినిమా. అయితే ఇమోషనల్, యాక్షన్ సీక్వెన్సెస్ తో పాటు ఈ సినిమాలో  భారీ స్థాయిలో జరుగుతున్న గ్రాఫిక్ వర్క్ కూడా ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ కానుంది. బాహుబలి సినిమా కోసం పై చేసిన గ్రాఫిక్ టీమ్, ఇప్పుడు సవ్యసాచి సినిమా కోసం పని చేస్తుంది.

ఓ వైపు మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమాలో నటిస్తూనే, ఈ సినిమా డబ్బింగ్ కూడా కంప్లీట్ చేసే ప్రాసెస్ లో ఉన్నాడు నాగచైతన్య. ఈ సినిమాలో చైతు సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.

చందూ మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ  యాక్షన్ ఎంటర్ టైనర్ పై భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రేమమ్ తరవాత సెట్స్ పైకి వఛ్చిన కాంబో కావడంతో మళ్ళీ అదే రేంజ్ మ్యాజిక్ వర్కవుట్ అవుతుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఫాన్స్. ఈ సినిమాలో భూమిక, మాధవన్ కీ రోల్స్ ప్లే చేస్తున్నారు.