ఎక్స్ క్లూజీవ్ : ఆనంద్ దేవరకొండ 'దొరసాని' అప్ డేట్స్

Thursday,November 01,2018 - 02:03 by Z_CLU

సెన్సేషనల్ హీరో ఇమేజ్ తో దూసుకెళ్తున్న విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ త్వరలోనే హీరోగా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే… కే.వి.ఆర్.మహేంద్ర డైరెక్షన్ లో పిరియాడిక్ లవ్ స్టోరీతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం నల్గొండ పరిసర ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటుంది.డిసెంబర్ నుండి వరంగల్ లో రెండో షెడ్యుల్ జరుపుకోనుందని సమాచారం.

తెలంగాణా బ్యాక్ డ్రాప్ కథతో రూపొందుతున్న ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ సరసన రాజశేఖర్ కూతురు శివాత్మిక హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు ‘దొరసాని’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.

సురేష్ బాబు, మధురా శ్రీధర్, యష్ రంగినేని ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి ఓ ప్రెస్ మీట్ పెట్టి ఆనంద్ దేవరకొండ, శివాత్మిక ను ప్రేక్షకులకు పరిచయం చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.