బాహుబలి సెట్ లో అప్పటి హంగామా...

Sunday,May 14,2017 - 10:05 by Z_CLU

వరల్డ్ వైడ్ గా 1000 కోట్ల మార్క్ దాటి ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన బాహుబలి-2 ప్రెజెంట్ సోషల్ మీడియాలో వర్కింగ్ స్టిల్స్ తో హల్చల్ చేస్తోంది. ఆ మధ్య ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా సెట్ లో హంగామా చేసిన స్టార్ హీరోల ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి..

అప్పుడెప్పుడో ఈ సినిమా షూటింగ్ స్పాట్ లో బన్నీ ప్రభాస్ ను కలిసి మాట్లాడుతున్న ఫోటో హంగామా చేయగా ఇప్పుడు మరి కొందరు స్టార్ హీరోలు కూడా బాహుబలి సెట్ లో సందడి చేసిన ఫోటోలు హల్చల్ చేస్తూ ఎట్రాక్ట్ చేస్తున్నాయి..

ఇక ఆ మధ్య యాంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా బాహుబలి సెట్ లో కాసేపు జక్కన్నతో కలిసి హంగామా చేసిన ఫోటో కూడా సోషల్ మీడియా లో హల్చల్ చేసింది..

ఆ తర్వాత తన ఖైదీ నంబర్ 150 షూటింగ్ జరుగుతుండగా బాహుబలి టీంకి మెగా స్టార్ చిరు శుభాకాంక్షలు తెలిపిన ఫోటో కూడా ఒకటి సోషల్ మీడియా లో వైరల్ అయి అందరినీ ఎట్రాక్ట్ చేసింది..


నాని అయితే బాహుబలి సెట్ లోకి ఎంట్రీ ఇవ్వడమే కాకుండా ఏకంగా మెగా ఫోన్ పట్టుకొని మరీ రాజమౌళి స్తానంలో సరదాగా సరదాగా దర్శకత్వం కూడా వహించి అప్పట్లో హల్చల్ చేశాడు..


తన ఫామిలీ తో కలిసి బాహుబలి సెట్ లో అర్జున్ సందడి చేసిన ఫోటోలు ఇటీవలే సోషల్ మీడియా లో వైరల్ అయిన సంగతి తెలిసిందే.. అసలు అర్జున్ బాహుబలి షూటింగ్ కి వెళ్లినట్లు గాని టీం తో మంతనాలు జరిపినట్లు ఈ ఫోటో లు విడుదలయ్యేవరకూ ఎవ్వరికి తెలియకపోవడంతో బాహుబలి టీంతో అర్జున్ దిగిన ఫోటోలు ఆడియన్స్ ను అవాక్కయ్యేలా చేసి హల్చల్ చేశాయి..


ఇక బాహుబలి టీంతో అర్జున్ దిగిన ఫోటోలు నిన్నటి వరకూ హంగామా చేయగా తాజాగా బాహుబలి షూటింగ్ స్పాట్ లో వెంకటేష్ సందడి చేసిన ఫోటోలు హంగామా చేస్తున్నాయి.దాదాపు కొన్ని గంటల పాటు వెంకీ బాహుబలి యూనిట్ తో గడిపి కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కూడా ఆసక్తిగా చూశాడట..


ఇక బాహుబలి సెట్ లో హంగామా చేసిన స్టార్స్ లిస్ట్ లో ఇప్పుడు రవి తేజ కూడా చేరిపోయాడు.. మొన్నటి వరకూ సినిమాలకు గాప్ తీసుకున్న మాస్ మహారాజ్ కూడా ఆ గ్యాప్ లో బాహుబలి సెట్ లో ఎంట్రీ ఇచ్చి కాసేపు సందడి చేసి యూనిట్ లో ఫుల్ జోష్ నింపాడట.. అప్పుడు ప్రభాస్-రానా లతో ఏదో కామెడీ చేస్తున్న రవి తేజ ఫోటోలు ప్రెజెంట్ సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నాయి.. సో అప్పుడెప్పుడో బాహుబలి సెట్ లో హంగామా చేసిన స్టార్స్ ఇప్పుడు బయటపడ్డారన్నమాట..