సమంత సరసన విజయ్ దేవరకొండ ?

Sunday,May 14,2017 - 10:34 by Z_CLU

సావిత్రి మీద బయోపిక్ గా సినిమా రాబోతుందనగానే ఈ సినిమా పై ఇటు టాలీవుడ్ లో అటు కోలీవుడ్ లో క్యూరియాసిటీ నెలకొంది.. ఈ సినిమాలో సావిత్రి రోల్ లో కీర్తి సురేష్ నటించనుండగా సమంత మరో కీ రోల్ లో కనిపించబోతుంది..

ఇప్పటి వరకూ వీరిద్దరితో పాటు జెమినీ గణేశన్ రోల్ కి దుల్కర్ సల్మాన్ ను ఫైనల్ చేసిన మేకర్స్ లేటెస్ట్ గా మరో హీరో విజయ్ దేవర కొండ ను ఈ సినిమాకి కన్ఫర్మ్ చేశారనే వార్త టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తుంది.. అయితే ఈ సినిమాలో విజయ్ సమంత కి లవర్ గా నటించబోతున్నదనే టాక్ కూడా వినిపిస్తుంది.. ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే…