జీ సినిమాలు ( 14th మే )

Saturday,May 13,2017 - 11:47 by Z_CLU

వెంగమాంబ

నటీ నటులు : మీనా, శరత్ బాబు, సాయి కిరణ్

ఇతర నటీ నటులు : సాయి కిరణ్, సన, సుబ్బరాయ శర్మ, అశోక్ రావు, అనంత, సుధా, శివ పార్వతి, శ్రీరామ్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : ఎం.ఎం.కీరవాణి

డైరెక్టర్ : ఉదయ్ భాస్కర్

ప్రొడ్యూసర్ : దొరై స్వామి రాజు

రిలీజ్ డేట్ : జులై 17, 2009

మీనా, శరత్ బాబు , సాయికిరణ్ వంటి మొదలగు వారితో దర్శకుడు ఉదయ్ భాస్కర్ తెరకెక్కించిన వెంగమాంబ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన భక్తి రస చిత్రం ‘వెంగమాంబ’. ఈ చిత్రం లో కథానాయకుడు సాయి కిరణ్ వెంకటేశ్వర స్వామిగా నటించారు. కొన్ని భక్తి రస సన్నివేశాలు, నటీ నటుల గెటప్స్ ఈ సినిమాకు హైలైట్స్.

==============================================================================

సంథింగ్ సంథింగ్  

నటీ నటులు : సిద్ధార్థ, హన్సిక మోత్వాని

ఇతర తారాగణం : బ్రహ్మానందం, గణేష్ వెంకట్ రామన్, సమంతా, రాణా

సంగీతం : సత్య

డైరెక్టర్ : C. సుందర్

నిర్మాత : B.సుబ్రహ్మణ్యం, సురేష్

ఎప్పుడూ సరికొత్త కాన్సెప్ట్స్ తో తెరపైకి వచ్చే సిద్ధార్థ్ కరియర్ లో సక్సెస్ ఫుల్ గా నిలిచిన సినిమా “సమ్ థింగ్ సమ్ థింగ్” తన ప్రేమను దక్కించుకోవడం కోసం లవ్ గురు ను సంప్రదించిన కుర్రాడి జీవితంలో జరిగిన మార్పులు ఆద్యంతం నవ్విస్తూనే ఉంటాయి. లవ్ గురు పాత్రలో బ్రహ్మానందం నటన సినిమాకే హైలెట్. దానికి తోడు గెస్ట్ అప్పియరెన్స్ తో సర్ ప్రైజ్ చేసే సమంతా, రాణా సినిమాకి మరో ఎసెట్. ఈ సినిమాతో హన్సిక సిద్ధార్థ కి పర్ ఫెక్ట్ ఆన్ స్క్రీన్ జోడి అనిపించుకుంది.

==============================================================================

ద మంకీ కింగ్ 2

నటీ నటులు : ఆరోన్ క్వోక్, గాంగ్ లీ

ఇతర నటీనటులు : ఫెంగ్ షావోఫెంగ్, జియావో షేన్ యాంగ్, హిమ్ లా, ఫెయి జియాంగ్, కెల్లీ చెన్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : క్రిస్టఫర్ యంగ్

డైరెక్టర్ : చియాంగ్ పౌ సోయి

ప్రొడ్యూసర్ : కీఫర్ లియు

రిలీజ్ డేట్ : 5 ఫిబ్రవరి 2016

ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టంచిన హాంగ్ కాంగ్ చైనీస్ ఫాంటసీ యాక్షన్ ఎంటర్ టైనర్ ద మంకీ కింగ్ 2. ‘జర్నీ టు ద వెస్ట్’ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా రిలీజైన ప్రతి చోట సంచలనం సృష్టించింది. ఈ సినిమా కథ నుండి మొదలుపెడితే ప్రతి సన్నివేశం సినిమాకి హైలెట్ గా నిలిచింది.

=============================================================================

శివగంగ

నటీనటులు : శ్రీరామ్, రాయ్ లక్ష్మి

ఇతర నటీనటులు : సుమన్, జాన్ పీటర్, శరవణన్, శ్రీనివాసన్, సింగం పూడి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : జాన్ పీటర్

డైరెక్టర్ : V.C. వడివుడియన్

ప్రొడ్యూసర్ : జాన్ మ్యాక్స్, జోన్స్

రిలీజ్ డేట్ : మార్చి 4, 2016

శ్రీ రామ్, రాయ్ లక్ష్మీ నటించిన అల్టిమేట్ హారర్ ఎంటర్ టైనర్ శివగంగ. వడివుడియన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో హారర్ ఎలిమెంట్స్ హైలెట్ గా నిలిచాయి.

==============================================================================

ధర్మచక్రం

నటీ నటులు : వెంకటేష్, రమ్య కృష్ణన్, ప్రేమ

ఇతర నటీనటులు : గిరీష్ కర్నాడ్, శ్రీ విద్య, D. రామానాయుడు

మ్యూజిక్ డైరెక్టర్ : M.M.శ్రీలేఖ

డైరెక్టర్ : సురేష్ కృష్ణ

ప్రొడ్యూసర్ : D. రామానాయుడు

రిలీజ్ డేట్ : 13 జనవరి 1996

విక్టరీ వెంకటేష్ నటించిన సూపర్ సెన్సేషనల్ హిట్ ధర్మచక్రం. డబ్బుందన్న అహంతో తన ప్రేమను తనకు దక్కకుండా చేసిన తండ్రికి తగిన గుణపాఠం చెప్పే కొడుకుగా వెంకటేష్ నటన సినిమాకి హైలెట్. సురేష్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి M.M.శ్రీలేఖ సంగీతం అందించారు.

==============================================================================

ప్రతిబంధ్

నటీనటులు : చిరంజీవి, జూహి చావ్లా

ఇతర నటీనటులు : రామిరెడ్డి, హరీష్ పటేల్, జె.వి. సోమయాజులు, కులభూషణ్ కర్బంద, షఫీ ఇనాందార్, రీమా లాగూ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : లక్ష్మీకాంత్-ప్యారేలాల్

డైరెక్టర్ :  రవి రాజా పినిశెట్టి

ప్రొడ్యూసర్ : అల్లు అరవింద్

రిలీజ్ డేట్ : సెప్టెంబర్ 28, 1990

తెలుగులో రాజశేఖర్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ హిట్ అంకుశం సినిమాకి హిందీ రీమేక్ వర్షన్ ప్రతిబంద్. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాతోనే బాలీవుడ్ కి పరిచయం అయ్యారు. రవిరాజా పినిశెట్టి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా బాలీవుడ్ లోను సూపర్ హిట్టయింది.