సోషల్ మీడియాలో ‘Mom’ సంచలనం

Tuesday,April 18,2017 - 05:20 by Z_CLU

ఇంగ్లీష్ వింగ్లీష్ లాంటి ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ తరవాత శ్రీదేవి గ్యాప్ తీసుకుని మళ్ళీ సెట్స్ పైకి వచ్చిన సినిమా ‘Mom’. అల్టిమేట్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనాలు సృష్టిస్తోంది. ఈ సినిమా హిందీ టీజర్ కు జస్ట్ 2 వాారాాల్లో 60లక్షల వ్యూస్ వచ్చాయి. ఇంకో 10 రోజుల్లో ఈ సినిమాకు కోటి వ్యూస్ వచ్చే అవకాశముంది.

జీ స్టూడియోస్, బోణీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘Mom’ టీజర్ రీసెంట్ గా రిలీజైంది. ఈ సినిమాలో తన కూతురిని కాపాడుకునే టఫ్ఫెస్ట్ విమెన్ క్యారెక్టర్ లో నటిస్తుంది శ్రీదేవి. A.R. రెహ్మాన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్ధిఖీ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్నాడు.

14 జూలై 2017 న రిలీజ్ కి రెడీ అవుతున్న శ్రీదేవి ‘Mom’ రోజు రోజుకి సినిమాపై క్యూరాసిటీ రేజ్ చేస్తూనే ఉంది. శ్రీదేవి తో పాటు ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా, అభిమన్యు సింగ్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. రవి ఉదయ్ వార్ ఈ సినిమాకి డైరెక్టర్. ఈ మధ్యే ఈ సినిమా తెలుగు వెర్షన్ టీజర్ కూడా విడుదల చేశారు.