నన్ను జోకర్ అని పిలుస్తారు

Monday,July 03,2017 - 08:02 by Z_CLU

జూలై 7 న శ్రీదేవి మామ్ రిలీజవుతుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రమోషన్స్ డోస్ పెంచేసింది సినిమా యూనిట్. ఈ ప్రాసెస్ లో మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంటరెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంది అతిలోక సుందరి…

ANR, NTR, రజినీ కాంత్, కమల హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి పెద్ద స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు… 300 సినిమాల జర్నీ… ఎలా అనిపిస్తుంది…?

చాలా హ్యాప్పీగా అనిపిస్తుంది. అంత పెద్ద స్టార్స్ తో పనిచేసే అవకాశం రావడం నిజంగా అదృష్టమే. 300 సినిమా జర్నీలో చాలా నేర్చుకున్నాను. ఇప్పటికీ ఆ అనుభవం ఒక అందమైన కలలాగే అనిపిస్తుంది. ఇప్పటికీ నాకు ప్రతీది కొత్తగానే అనిపిస్తుంది. ప్రతి సినిమా ఫస్ట్ మూవీగానే అనిపిస్తుంది.

ఇన్నేళ్ళ సినిమా జర్నీలో ఏం గమనించారు..?

నా సినిమా జర్నీ గురించి చెప్పాలంటే ప్రతీది అద్భుతమే. మళ్ళీ అలాంటి రోజులు రావు.. ఇండస్ట్రీ చాలా మారింది. ఒక రకంగా చెప్పాలంటే ఇండస్ట్రీ చాలా ప్రొఫెషనల్ గా తయారయింది. ఇండస్ట్రీ అప్పటి కన్నా ఇప్పుడు చాలా బావుంది.

మిమ్మల్ని డిఫెరెంట్ రోల్స్ లలో చూశాం… నిజానికి రియల్ శ్రీదేవి ఎలా ఉంటుంది..?

నేను చాలా జోవియల్ గా ఉంటాను. నిజం చెప్పాలంటే నన్ను ఇంట్లో అందరు జోకర్ అని పిలుస్తారు.  

ఇంట్లో పిల్లలతో ఎలా ఉంటారు? ఎవరు స్ట్రిక్ట్ గా ఉంటారు..?

స్ట్రిక్ట్ గా జోవియల్ గా కాదు. బ్యాలన్స్డ్ గా ఉంటాము…. ఎప్పుడైనా నేను కోపంగా ఉన్నప్పుడు బోణీ కూల్ గా హ్యాండిల్ చేస్తారు. ఆయన కోపంగా ఉన్నప్పుడు నేను కూల్ గా హ్యాండిల్ చేస్తాను.

జాహ్నవి ఫిల్మ్ స్టార్ అవుతాను అని చెప్పినప్పుడు షాక్ అయ్యారా..?

లేదు షాక్ అవ్వలేదు…. తనకు చిన్నప్పటి నుండి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. ఒకసారి ఒక ఫ్యామిలీ ఫంక్షన్ టైమ్ లో ‘పెద్దయ్యాక ఏమవుతావు..?’ అనడిగితే… నేను డాక్టర్ ని అవుతాను అంది. చాలా హ్యాప్పీగా ఫీల్ అయ్యాం. కానీ ఆ తరవాత సినిమాలో డాక్టర్ ని అవుతాను క్లారిటీ ఇచ్చింది. మాకప్పుడే అర్థమయిపోతుంది.

మీరు ఇంత పెద్ద స్టార్… మీ డాటర్ సినిమా అనగానే చాలా ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి… అలాంటప్పుడు మీరు జహ్నవికి తన కరియర్  విషయం లో ఎలాంటి సలహాలిస్తారు..?

స్టార్ డాటర్ లాంటి ఎక్స్ పెక్టేషన్స్ లేకపోతేనే బెటర్. ఎందుకంటే ఎవరికీ వారు కష్టపడి ప్రూఫ్ చేసుకోవాలి. దాన్నే నేను నమ్ముతాను. ఇక జాహ్నవి విషయానికి వస్తే డెఫ్ఫినేట్ గా హార్డ్ వర్క్ చేయాలి… వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనే చెప్తాను…