సెన్సార్ క్లియరెన్స్ పొందిన శ్రీదేవి ‘మామ్’

Tuesday,June 27,2017 - 03:20 by Z_CLU

శ్రీదేవి నటించిన ‘మామ్’ ఫ్యామిలీ ఆడియెన్స్ లో సరికొత్త ఇంట్రెస్ట్ ని జెనెరేట్ చేస్తుంది. సెన్సార్ క్లియర్ చేసుకుని UA సర్టిఫికేట్ పొందిన ఈ సినిమా, శ్రీదేవి కరియర్ లోనే 300 వ సినిమా కావడంతో న్యాచురల్ గానే ఈ సినిమాపై బోలెడన్నీ ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ అయి ఉన్నాయి. దానికి తోడు రీసెంట్ గా రిలీజైన ట్రేలర్ సినిమా సక్సెస్ కి కావాలసినంత ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది.

ఈ సినిమాలో శ్రీదేవి టీనేజ్ గర్ల్ కి తల్లిగా నటిస్తుంది. తన పిల్లల విషయంలో ఏదైనా ఆపద ముంచుకు వస్తే తల్లి ఎలాటి నిర్ణయాలు తీసుకుంటుంది…? వాటిని ఎలా ఫేస్ చేస్తుంది..? లాంటి ఇమోషనల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సినిమాకి పెద్ద ఎసెట్ కానున్నాయి. A.R. రెహ్మాన్ సంగీతం సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేస్తుంది. ఈ సినిమా జూలై 7 నుండి  థియేటర్స్ లో సందడి చేయడానికి రెడీ అవుతుంది.