ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజైన మామ్

Friday,July 07,2017 - 11:22 by Z_CLU

ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కిన శ్రీదేవి మామ్ సినిమా ఈరోజు గ్రాండ్ గా రిలీజైంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1800లకు పైగా స్క్రీన్స్ పై మామ్ రిలీజైంది. ఓ సీనియర్ నటి సినిమా ఈ స్థాయిలో విడుదలకావడం నిజంగా గొప్ప విషయమే. హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదలైన ఈ సినిమాను ఒక్క హిందీలోనే 1260 స్క్రీన్స్ పై ప్రదర్శిస్తున్నారు. ఇక ఓవర్సీస్ లో ఈ సినిమా 456 స్క్రీన్స్ పై సక్సెస్ ఫుల్ గా లాంచ్ అయింది.

శ్రీదేవికి, మామ్ సినిమాకు విడదీయరాని కనెక్షన్ ఉంది. 50 ఏళ్ల కెరీర్ పూర్తిచేసుకుంటున్న తరుణంలో శ్రీదేవి నుంచి వచ్చిన సినిమా ఇది. పైగా దీనికి భర్త బోనీకపూర్ నిర్మాత. శ్రీదేవి నటించిన మొదటి సినిమా విడుదలైన జూలై 7నే ఈ సినిమా కూడా థియేటర్స్ లోకి వచ్చింది.

ఈ ప్రత్యేకతలతో పాటు మామ్ కు సంబంధించి మరో ప్రత్యేకత కూడా ఉంది.. మామ్ సినిమా కోసం నాలుగు భాషల్లో శ్రీదేవే స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు అన్ని ప్రాంతాల నుంచి కంప్లీట్ పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి.