నెక్ట్స్ సినిమాలో బన్నీ క్యారెక్టర్ ఇదేే...?

Tuesday,April 18,2017 - 04:19 by Z_CLU

తన పుట్టినరోజు సందర్భంగా వక్కంతం వంశీ దర్శకత్వంలో సినిమా ఎనౌన్స్ చేశాడు అల్లు అర్జున్. మే లేదా జూన్ నెలలో ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. ప్రస్తుతం దర్శకుడు ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇప్పుడీ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ మేటర్ బయటకొచ్చింది.

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం, తన నెక్ట్స్ సినిమాలో సైనికుడిగా కనిపించబోతున్నాడట అల్లు అర్జున్. సినిమాలో పుల్ లెంగ్త్ లో వీరజవాన్ లా కనిపిస్తాడా లేక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో సైనికుడి గెటప్ లో కనిపిస్తాడా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. కథ ప్రకారం సినిమాలో కొంత భాగాన్ని జమ్ముకశ్మీర్ లో షూట్ చేస్తారట. బన్నీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సరైనోడు సినిమాలో కూడా మిలట్రీ బ్యాక్ డ్రాప్ ఉంది.

ప్రస్తుతానికి ఈ సినిమాకు “నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా” అనే డిఫరెంట్ టైటిల్ అనుకుంటున్నారు. సినిమాను ఎనౌన్స్ చేసినప్పుడు టైటిల్ పై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఈ మూవీలో ఓ బాలీవుడ్ భామను హీరోయిన్ గా తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ సినిమాకు బాలీవుడ్ సంగీత దర్శకులు విశాల్-శేఖర్  మ్యూజిక్ అందించనున్నారు.