కీ ఎలిమెంట్స్ తో ఎట్రాక్ట్ చేస్తున్న మామ్

Monday,July 10,2017 - 02:20 by Z_CLU

శ్రీదేవి 300 వ సినిమా అనగానే న్యాచురల్ గానే క్రియేట్ అయిన ఎక్స్ పెక్టేషన్స్ సినిమా రిలీజయ్యాక మరి ఆ రేంజ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేశాయా..? అంటే అవుననే అంటున్నారు క్రిటిక్స్. 5 పదుల వయసులోనూ అంతే గ్రేస్ ఫుల్ ప్రెజెంటేషన్ తో ఎట్రాక్ట్ చేసిన శ్రీదేవి, ‘మామ్’ లో అతిలోక సుందరి గా కాదు, అత్యంత పవర్ ఫుల్ విమెన్ గా ఎట్రాక్ట్ చేయడంలో సక్సెస్ అయింది.

అల్టిమేట్ రివేంజ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీదేవి, తన కూతురికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునే తల్లిలా ఇంప్రెసివ్ గా కనిపించింది. గతంలో శ్రీదేవి ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ లో ఒక సాధారణ మహిళగా న్యాచురల్ గా ఆకట్టుకున్న శ్రీదేవి… మామ్ లో ఈ రేంజ్ ఇంటెన్సివ్ క్యారెక్టర్ లో నటించనుందని ఎవరూ కనీసం గెస్ చేసి ఉండరు.

సినిమా రిలీజ్ కి ముందు సినిమాపై అటెన్షన్ ని క్రియేట్ చేసిన కీ ఎలిమెంట్స్ శ్రీదేవి, అక్షయ్ ఖన్నా, నవాజుద్దీన్ సిద్దీఖీ లైతే, సినిమా రిలీజ్ తరవాత అదే రేంజ్ అటెన్షన్ ని గ్రాబ్ చేయడంలో సక్సెస్ అయ్యారు సాజల్ అలీ, పాకీస్తాని నటుడు అద్నాన్ సిద్దీఖీ. ఈ సినిమా కి రవి ఉద్యవార్ డైరెక్టర్.