రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్న స్పైడర్

Monday,June 05,2017 - 12:02 by Z_CLU

మహేష్ బాబు సినిమా కోసం ప్రేక్షకులు ఎంతలా ఎదురుచూస్తున్నారనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. స్పైడర్ మూవీ టీజర్ గంట గంటకు ఓ సరికొత్త రికార్డు సృష్టిస్తూ యూట్యూబ్ లో దూసుకుపోతోంది. ఈ సినిమా టీజర్ దెబ్బకు ఇప్పటివరకు బడా స్టార్స్ క్రియేట్ చేసిన సోషల్ మీడియా రికార్డులన్నీ చెల్లాచెదురవుతున్నాయి. తాజాగా స్పైడర్ టీజర్ మరో రికార్డు నంబర్ నోట్ చేసింది.

మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ కు సోషల్ మీడియాలో 84 గంటల్లో 13 మిలియన్ వ్యూస్ వచ్చాయి. వీటిలో యూట్యూబ్ వ్యూస్ 9.2 మిలియన్ కాగా, ఫేస్ బుక్ వ్యూస్ 3.8 మిలియన్. ఇప్పటికీ ఈ సినిమా టీజర్ కు ప్రపంచవ్యాప్తంగా ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది.

కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది స్పైడర్ మూవీ. సినిమాలో మహేష్ బాబు గూఢచారిగా కనిపిస్తాడట. బయో టెర్రరిజంపై సినిమా ఉంటుందని టాక్. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు ఎస్ జే సూర్య విలన్ గా కనిపించబోతున్నాడు.