స్పైడర్ టీజర్ ఓ కాన్సెప్ట్ మాత్రమే

Tuesday,September 26,2017 - 12:12 by Z_CLU

స్పైడర్ టీజర్ ఓ ట్రెండ్ క్రియేట్ చేసింది. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హల్ చల్ చేసింది. ఓ రోబో సాలీడు అలా వచ్చి మహేష్ బాబు పై నుంచి పాకుతూ భుజాలపైకి చేరుకునే టీజర్ ఇప్పటికీ అందరికీ గుర్తే. సినిమాలో ఈ రోబో సాలీడు కూడా ఉందని చాలామంది అనుకున్నారు. ఎట్టకేలకు దీనిపై మహేష్ క్లారిటీ ఇచ్చాడు.

“టీజర్ లో రోబో స్పైడర్ అనేది కాన్సెప్ట్ మాత్రమే. సినిమాకు దాంతో సంబంధం లేదు.. సినిమాలో రోబో స్పైడర్ ఏం ఉండదు. హీరో పాత్రను పరిచయం చేసేందుకు మాత్రమే ఆ టీజర్ ను అలా తయారుచేశాం. అది చాలా ఇన్నొవేటివ్ ఐడియా. ఈ  విషయంలో ఆడియన్స్ కాస్త కన్ఫ్యూజ్ అవుతున్నారు. నిజానికి సినిమాలో అలాంటి స్పైడర్ (సాలీడు) ఉండదు.” రోబో సాలీడుపై మహేష్ క్లారిటీ ఇది.

రేపు రిలీజ్ కాబోతున్న స్పైడర్ సినిమాలో చాలా ఎట్రాక్షన్స్ ఉన్నాయంటున్నాడు మహేష్. ట్రయిలర్ లో చూసింది చాలా తక్కువని, ఉత్కంఠకు గురిచేసే సన్నివేశాలు, థ్రిల్ కలిగించే ఎపిసోడ్స్ సినిమాలో ఉన్నాయంటున్నాడు.