రూ.150 కోట్లు.. దూసుకుపోతున్న స్పైడర్

Monday,October 09,2017 - 10:46 by Z_CLU

మహేష్-మురుగదాస్ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కిన స్పైడర్ సినిమా కళ్లుచెదిరే వసూళ్లతో దూసుకుపోతోంది. విడుదలైన అన్ని ప్రాంతాల్లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. ప్రపంచవ్యాప్త వసూళ్లలో తాజాగా 150 కోట్ల రూపాయల గ్రాస్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. మహేష్ కెరీర్ లోనే అతి తక్కువ రోజుల్లో 150 కోట్ల రూపాయల గ్రాస్ సాధించిన చిత్రంగా నిలిచింది స్పైడర్.

విడుదలైన మొదటి రోజు నుంచే స్పైడర్ సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. మొదటి రోజే ప్రీమియర్స్ తో కలుపుకొని 51 కోట్ల రూపాయల గ్రాస్ సాధించినే ఈ సినిమా.. రెండో రోజు 72 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. అదే ఊపులో 3 రోజుల్లో వంద కోట్ల రూపాయలు ఆర్జించిన స్పైడర్.. తాజాగా 150 కోట్ల రూపాయల క్లబ్ లోకి ఎంటరైంది. కేవలం 12 రోజుల్లో ఈ ఘనత సాధించింది.

దసరా సందర్భంగా గతనెల 27న విడుదలైన ఈ సినిమా 120 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కింది. ఫెస్టివ్ సీజన్ ముగిసినా.. వర్కింగ్ డేస్ ప్రారంభమైనా స్పైడర్ హవా మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో స్ట్రాంగ్ గా కొనసాగుతోంది.