ఆయనే వల్లే ఈ స్థాయిలో..

Monday,June 05,2017 - 01:04 by Z_CLU

హ్యాపీడేస్ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి ప్రెజెంట్ వరుస సూపర్ హిట్స్ తో దూసుకుపోతూ మినిమమ్ గ్యారెంటీ హీరో అనే ఇమేజ్ సొంతం చేసుకున్న నిఖిల్ పరిశ్రమకు వచ్చి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తాజాగా తన దర్శకులతో సెలెబ్రేషన్స్ చేసుకున్నాడు .

ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ ” 2007 లో హ్యాపీడేస్ రిలీజ్ అయింది. అప్పట్లో సినిమా ఇండస్ట్రీ కి ఎలా రావాలి అనుకుంటూ ఎలా వెళ్ళాలి అనే డౌట్ తో నటుడిగా చాలా సినిమాల్లో ట్రై చేశాను. చాలా మంది బ్యాగ్రౌండ్ లేకపోతే కష్టం అని చెప్పారు. ఫైనల్లీ హ్యాపీ డేస్ సినిమా ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలుసుకొని అక్కడికెళ్ళా..ఆ ఆడిషన్లో శేఖర్ గారు నన్ను సెలెక్ట్ చేయడం ఆ ఇయర్ లో ఆ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం ఎప్పటికి మర్చిపోలేని ఒక గొప్ప అనుభూతి. నిజంగా శేఖర్ కమ్ముల గారు చాలా మంది యంగ్ స్టర్స్ కి ఆదర్శం. నేను ఏ సినిమా చేసినా ఆయన్నే ఆదర్శంగా తీసుకుంటా.. ఆయన ఛాన్స్ ఇవ్వడం వాళ్లే ఇండస్ట్రీ లో హీరోగా పదేళ్లు పూర్తి చేసుకోగలిగాను. ఆయనని ఎప్పటికీ మర్చిపోలేను నాకు అయన దేవుడి తో సమానం. ఆయన ఈ రోజు ఈ 10 ఇయర్స్ సెలెబ్రేషన్స్ కి రావడం నన్ను బ్లేస్ చేయడం సంతోషంగా ఉంది. అలాగే ఈ పదేళ్లలో నాతో సినిమాలు చేసిన డైరెక్టర్స్ అందరికీ నా కృతజ్ఞతలు చెప్తున్నా” అని తెలిపాడు.