మరికొన్ని గంటల్లో గ్రాండ్ గా ప్రీమియర్స్

Tuesday,September 26,2017 - 11:21 by Z_CLU

మహేష్ నటించిన మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ స్పైడర్ ఫస్ట్ రిపోర్ట్ మరికొన్ని గంటల్లో రాబోతోంది. ఈ సినిమాకు సంబంధించి ఓవర్సీస్ లో గ్రాండ్ గా ప్రీమియర్స్ ఎరేంజ్ చేశారు. ఇంకాసేపట్లో ఈ ప్రీమియర్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఒక్క అమెరికాలోనే 300కు పైగా లొకేషన్లలో స్పైడర్ ప్రీమియర్స్ ప్లాన్ చేశారు.

ఇక ఫస్ట్ రిపోర్ట్ విషయానికొస్తే దుబాయ్ నుంచి స్పైడర్ రిపోర్ట్ మొదటగా రానుంది. ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళ భాషలతో పాటు అరబ్బీలో కూడా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. సో.. ప్రీమియర్స్ కూడా అరబ్బీలోనే ఉంటాయి.

ఇక తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో స్పైడర్ విడుదలకు సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్, నైజాం ఏరియాల్లో స్పైడర్ కు భారీగా థియేటర్లు దక్కాయి. ఒక్క హైదరాబాద్ లోనే రేపు 24 గంటల్లో 450కి పైగా షోలు పడబోతున్నాయి. మూవీకి సంబంధించి ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి.