50 కోట్ల క్లబ్ లోకి దూసుకుపోతున్న స్పైడర్

Tuesday,October 03,2017 - 11:26 by Z_CLU

మహేష్-మురుగదాస్ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కిన స్పైడర్ సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. విడుదలైన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 51 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా.. 2 రోజుల్లో 71 కోట్లు.. 3 రోజుల్లో 100 కోట్ల గ్రాస్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఇక షేర్ పరంగా చూసుకుంటే.. ఇప్పటికే 40 కోట్ల క్లబ్ ను క్రాస్ చేసిన స్పైడర్ మూవీ.. మరికొన్ని రోజుల్లో 50 కోట్ల రూపాయల షేర్ సాధించబోతోంది.

ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. స్పైడర్ కు 44 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. ఈ వీకెండ్ కంటే ముందే ఈ సినిమా 50 కోట్ల రూపాయల క్లబ్ లోకి ఎంటరయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే తెలుగుతో పాటు అటు తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో స్పైడర్ సినిమా స్ట్రాంగ్ గా రన్ అవుతోంది.

త్వరలోనే స్పైడర్ ను మరిన్ని దేశాల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అటు అరబ్బీ వెర్షన్ ను కూడా మరిన్ని యూఏఈ దేశాల్లో విడుదల చేయాలనుకుంటున్నారు.