U.S. లో గ్రాండ్ గా రిలీజవుతున్న స్పైడర్

Tuesday,September 12,2017 - 03:33 by Z_CLU

మహేష్ బాబు స్పైడర్ సెప్టెంబర్ 27 న రిలీజ్ కానుంది. రీసెంట్ గా రిలీజైన ఆడియో సూపర్ హిట్టవ్వడంతో ఎక్కడ చూసినా స్పైడర్ ఫీవర్ కనిపిస్తుంది. ఓవర్సీస్ లోను అదే రేంజ్ డిమాండ్  క్రియేట్ చేసుకున్న  స్పైడర్ ఒక్క U.S. లోనే ఏకంగా 400 కు పైగా లొకేషన్ లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

U.S. లో ఒక్క  తెలుగులోనే  600 కు పైగా స్క్రీన్స్ లలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్న సినిమా యూనిట్, ప్రమోషన్స్ ని కూడా అదే రేంజ్ లో ప్లాన్ చేస్తుంది. హై ఎండ్ టెక్నికల్ వ్యాల్యూస్ తో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.

A.R. మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. హారిస్ జయరాజ్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.