'గుంటూరు కారం' షూటింగ్ అప్ డేట్స్

Tuesday,August 22,2023 - 12:43 by Z_CLU

మహేష్ బాబు , త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడో సినిమాగా రాబోతున్న ‘గుంటూరు కారం’ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం అన్నపూర్ణ ఏడెకారాల్లో యాక్షన్ ఎపిసోడ్ ఘాట్ చేస్తున్నారు. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ కంపోజ్ చేస్తున్న ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమా ఇంటర్వల్ బ్యాంగ్ కి ముందు రానుందని సమాచారం.

గుంటూరు కారం ద్వారా మహేష్ ను మరింత మాస్ గా ప్రెజెంట్ చేయబోతున్నాడు త్రివిక్రమ్. అందుకే సినిమాలో యాక్షన్ కి తగ్గట్టే ఘాటు టైటిల్ పెట్టారు. వచ్చే ఏడాది సంక్రాంతి కి రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ త్వరలోనే రిలీజ్ కానుంది. ఇప్పటికే ఆ సాంగ్ కి సంబంధించి లిరికల్ వీడియో , ప్రోమో కూడా రెడీ చేశారు.

హారికా హాసినీ క్రియేషన్స్ పై రాధా కృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ప్రకాశ్ రాజ్ , జగపతి బాబు, రమ్య కృష్ణ , మురళి శర్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.