'మహానుభావుడు' ఆడియో రిలీజ్ చేయనున్న రెబల్ స్టార్
Tuesday,September 12,2017 - 02:34 by Z_CLU
శర్వానంద్ మహానుభావుడు 29 సెప్టెంబర్ రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇప్పటికే రిలీజైన 2 సాంగ్స్ తో సినిమాపై ఇంటరెస్ట్ ని జెనెరేట్ చేసిన సినిమా యూనిట్, త్వరలో గ్రాండ్ గా ఆడియో రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేస్తుంది.అయితే ఈ ఆడియో రిలీజ్ కి రెబల్ స్టార్ ప్రభాస్ చీఫ్ గెస్ట్ గా రానున్నాడనే టాక్ ఇప్పుడు టాలీవుడ్ లో వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది.
గతంలో శర్వానంద్ సినిమాలు రన్ రాజా రన్, ఎక్స్ ప్రెస్ రాజా సినిమాల ఆడియో రిలీజ్ కి అటెండ్ అయిన ప్రభాస్, ఈ సినిమా ఆడియో ఈవెంట్ కి కూడా అటెండ్ అవ్వడం కంపల్సరీ అనే టాక్, ఫిలింనగర్ లో కాస్త గట్టిగానే వినిపిస్తుంది. మరి మహానుభావుడు టీమ్ ఈ విషయంలో ప్రభాస్ ని సంప్రదించిందా లేదా..? దానికి ప్రభాస్ రియాక్షన్ ఏమై ఉంటుంది లాంటి అప్ డేట్ తెలియాలంటే మరికొన్ని వెయిట్ చేయాల్సిందే.
మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా UV క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది. మెహరీన్ కౌర్ హీరోయిన్ గా నటించింది. S.S. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.