#Ashish3 త్రివిక్రమ్ క్లాప్ తో ప్రారంభం

Monday,August 21,2023 - 12:37 by Z_CLU

రెండో సినిమా రిలీజ్ అవ్వకుండానే మూడో సినిమాను స్టార్ట్ చేశాడు హీరో ఆశిష్. దిల్ రాజు కుటుంబం నుండి ‘రౌడీ బాయ్స్’ సినిమాతో హీరోగా పరిచయమైన ఆశిష్ కాశీ దర్శకత్వంలో సెల్ఫీష్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ స్టేజీలో ఉంది. నవంబర్ లేదా డిసెంబర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ లోపే మూడో సినిమా మొదలు పెట్టేశాడు కుర్ర హీరో.

అరుణ్ భీమవరపు దర్శకత్వంలో ఆశిష్ హీరోగా నటిస్తున్న సినిమా ఇవ్వాళ  గ్రాండ్ గా లాంచ్ అయింది. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్లాప్ తో సినిమా మొదలైంది. హైదరాబాద్ లో ఈరోజు నుంచే రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాకు టాప్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు. ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా , పీసీ శ్రీరామ్ కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నారు.

దిల్ రాజు ప్రొడక్షన్స్ పై హర్షిత్ రెడ్డి , హన్షిత రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇంకా హీరోయిన్ కన్ఫర్మ్ అవ్వలేదు. త్వరలోనే మిగతా డీటైల్స్ చెప్పనున్నారు.

 

ashish3-launch-zeecinemalu