గ్రాండ్ గా జరగనున్న స్పైడర్ ప్రీ రిలీజ్ ఈవెంట్

Tuesday,September 12,2017 - 04:36 by Z_CLU

రీసెంట్ గా చెన్నైలో ఆడియో రిలీజ్ ఈవెంట్ ని జరుపుకున్న స్పైడర్ సినిమా యూనిట్, ఇప్పుడు హైదరాబాద్ లో ఈ నెల 15 న స్పైడర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా జరుపుకోనుంది. ఇప్పటికే ఈ ఈవెంట్ కోసం గ్రౌండ్ వర్క్ బిగిన్ చేసిన సినిమా యూనిట్, టాలీవుడ్ ప్రముఖుల్ని ఈ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ గా ఇన్వైట్ చేసే ప్రాసెస్ లో ఉంది.

ఈ ఈవెంట్ లోనే స్పైడర్ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయనుంది సినిమా యూనిట్. సినిమాలో హైలెటెడ్ ఎలిమెంట్ గా ఎట్రాక్ట్ చేయనున్న యాక్షన్ ఎలిమెంట్స్ ఈ ట్రైలర్ లో స్పెషల్ ఎట్రాక్షన్ కానున్నాయి. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో S.J. సూర్య విలన్ గా నటించాడు. A.R. మురుగదాస్ డైరెక్టర్.