#69thNationalAwards సత్తా చాటిన తెలుగు సినిమాలు

Thursday,August 24,2023 - 07:36 by Z_CLU

69th నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ లిస్టు ప్రకటించారు. ఎప్పటిలానే ఈ సారి కూడా తెలుగు సినిమాలు సత్తా చాటాయి. పుష్ప సినిమాకు గానూ బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్ నేషనల్ అవార్డ్ అందుకున్నాడు. ఇండియా వైడ్ గా తొలిసారి తెలుగు యాక్టర్ గా అల్లు అర్జున్ కి అరుదైన గౌరవం దక్కింది. దీంతో బన్నీ ఫ్యాన్స్ తగ్గేదేలే అంటూ సంబరాలు చేసుకుంటున్నారు.  పుష్పకు మరో రెండు కేటగిరీ లో నేషనల్ అవార్డ్స్ లభించాయి. సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ కి బెస్ట్ మ్యూజిక్ డైరక్టర్ కేటగిరీ లో అవార్డ్ లభించింది.

ఇక రాజమౌళి తెరకెక్కించిన RRR ఆస్కార్ అవార్డ్స్ తో నేషనల్ అవార్డ్స్ లో కూడా సత్తా చాటింది. బెస్ట్ పాపులర్ ఫిలిం ప్రొవైడింగ్ హోల్ సమ్ ఎంటర్ టైన్మెంట్ (అన్ని వర్గాలను అలరించిన వినోదాత్మక చిత్రం) కేటగిరీలో అవార్డ్ దక్కింది. RRR కి మొత్తం ఆరు కేటగిరీలో నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. ఉత్తమ స్టంట్‌ కొరియో గ్రాఫర్‌గా కింగ్‌ సాల్మన్‌ కి, ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా ప్రేమరక్షిత్‌, ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌ సూపర్‌ వైజర్‌గా శ్రీనివాస మోహన్‌, ఉత్తమ గాయకుడు కాలభైరవ (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తమ నేపథ్య సంగీతం కీరవాణి అవార్డ్స్ కి ఎన్నికైయ్యారు.

ఉప్పెన సినిమాకు గానూ బెస్ట్ ఫీచర్ తెలుగు ఫిల్మ్ కేటగిరీలో అవార్డ్ వచ్చింది. దీంతో ఉప్పెన టీమ్ సంతోషంతో పండుగ చేసుకుంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన రెండు సినిమాలకు ఈసారి నేషనల్ అవార్డ్స్ దక్కడం విశేషం. ఇటీవలే ఆస్కార్ అందుకున్న చంద్రబోస్ కి ‘కొండపొలం’ సినిమాకు గానూ బెస్ట్ లిరిసిస్ట్ నేషనల్ అవార్డు దక్కింది.