రకుల్ ప్రీత్ విషయంలో అనుకోకుండానే...

Saturday,June 15,2019 - 02:03 by Z_CLU

ఆల్మోస్ట్ టాప్ స్టార్స్ హీరోయిన్స్ సరసన నటిస్తుంది. మొన్నటి వరకు జస్ట్ సౌత్ ఇండియాలో బిజీ హీరోయిన్ అనిపించుకున్నది కాస్తా ఇప్పుడు బాలీవుడ్ లో కూడా తన మార్క్ క్రియేట్ చేసుకుంది. ఏకంగా అజయ్ దేవ్ గన్ సరసన నటించి మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. అయితే ఈ మధ్య రకుల్ విషయంలో అనుకోకుండానే  ఓ విషయం రిపీటెడ్ గా జరుగుతుంది.

రకుల్ నటించిన బాలీవుడ్ సినిమాలో హీరో క్యారెక్టర్ ఏజ్డ్… 50 ఏళ్ళు పైబడిన వ్యక్తితో ప్రేమలో పడే అమ్మాయిగా నటించింది రకుల్ ఈ సినిమాలో. ఇప్పుడు ‘మన్మధుడు 2’ లో కూడా అంతే.. నాగార్జున ఈ సినిమాలో ఏజ్డ్ బ్యాచిలర్ గా కనిపించబోతున్నాడు.

అంతెందుకు వెంకటేష్ చేయబోతున్న ‘దేదే ప్యార్ దే’ సినిమాలో కూడా రకుల్ నే హీరోయిన్ గా ప్రిఫర్ చేస్తున్నారని సమాచారం. ఈ సినిమా తెలుగు రీమేక్ లో కూడా హీరో ఏజ్ 50 ప్లస్సే.

రకుల్ పక్కా ఇలాగే ప్లాన్ చేసుకుంది అని చెప్పలేం కానీ, ఈ రోల్ కి రకుల్ అయితేనే పర్ఫెక్ట్ అనిపించుకుంటుంది. హీరో క్యారెక్టర్ ని బట్టి కాస్త ఏజ్డ్ గా చూపించాలంటే న్యాచురల్ గానే హీరోయిన్ యంగ్ గా ఉండాలి. అందుకే ఇలాంటి క్యారెక్టర్స్ కి రకుల్ నే ప్రిఫర్ చేస్తున్నారు మేకర్స్.