టాప్ హీరోయిన్స్ - మ్యారేజ్ స్టేట్ మెంట్స్

Thursday,August 08,2019 - 11:02 by Z_CLU

పెళ్లి తరవాత కూడా అంతే సక్సెస్ ఫుల్ గా సినిమాలు చేసుకుంటుంది సమంతా. మరికొంతమంది టాప్ హీరోయిన్స్ రైట్ పర్సన్ కోసం ఎదురు చూస్తుంటే, కొందరేమో ప్రస్తుతానికి సినిమాలే… పెళ్ళికి టైమ్ ఉంది అంటున్నారు. రీసెంట్ టైమ్స్ లో పెళ్లికి సంబంధించి లేటెస్ట్ స్టేట్ మెంట్స్ ఇచ్చారు హీరోయిన్స్.

తమన్నా : మిల్కీ బ్యూటీ పెళ్ళికి రెడీ.. కానీ ఈ బాధ్యత మాత్రం తన పేరెంట్స్ కే అప్పగించింది. తనకు ఎలాంటి వాడితే బెటరో, తనకన్నా తన పేరెంట్సే కరెక్ట్ గా డిసైడ్ చేస్తారు అని నమ్మే తమన్నా, అలాంటి పర్ఫెక్ట్ మ్యాచ్ దొరికీ దొరగ్గానే పెళ్లి పీటలెక్కేస్తుందన్నమాట.

 

రకుల్ : పెళ్లి అంటే చాలా గౌరవం ఉందని చెప్పుకుంది రకుల్ ప్రీత్ సింగ్. రీసెంట్ గా ఓ సందర్భంలో లివిన్ రిలేషన్ షిప్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ‘మ్యారీడ్ లైఫ్’ కే ఓటేసింది.

అనుపమ పరమేశ్వరన్ : రీసెంట్ గా జస్ ప్రీత్ బుమ్రా తో రిలేషన్ షిప్ లో ఉందన్న విషయాన్ని అంతే సింపుల్ గా కొట్టేసింది అనుపమ పరమేశ్వరన్. నేను ‘సింగిల్’ అని స్టేట్ మెంట్ ఇచ్చింది.

కాజల్ అగర్వాల్ : ప్రస్తుతానికి ఇంకా సింగిలే. కానీ కరెక్ట్ పర్సన్ దొరికినప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటాను అని చెప్పుకుంది కాజల్ అగర్వాల్.

రష్మిక : సినిమాల్లోకి రాక ముందే ఎంగేజ్డ్…. కానీ ఇప్పుడు మాత్రం పక్కా సింగిల్. ప్రస్తుతానికి ఫుల్ ఫోకస్ సినిమాలపైనే అని చెప్పుకుంది రష్మిక.