రీసెంట్ గా అల్లు అర్జున్.. ఇప్పుడు వీళ్ళు...

Saturday,June 15,2019 - 01:06 by Z_CLU

ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ‘వెంకీమామ’ లో చాలా వరకు ఆర్మీ బ్యాక్ డ్రాప్ సీక్వెన్సెస్ ఉండబోతున్నాయి. అందుకే రీసెంట్ గా కాశ్మీర్ లో భారీ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుని వచ్చారు మేకర్స్. ఒక్క ‘వెంకీమామ’ విషయంలోనే కాదు సినిమాలో ఆర్మీ బ్యాక్ డ్రాప్ సన్నివేశాలు ఉంటే చాలు, సన్నివేశాల కోసం కాశ్మీర్ నే ఎంచుకుంటున్నారు.

గతంలో అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ కోసం కూడా కాశ్మీర్ కి వెళ్ళాడు. సినిమాలోని చాలా సన్నివేశాలు ఈ లొకేషన్ లో షూట్ చేసినవే. సినిమాలోని కొన్ని చోట్ల రియల్ ఇంపాక్ట్ కోసం రియల్ ఇన్సిడెంట్స్ ని క్యాప్చర్ చేశారు మేకర్స్. ఇప్పుడు ఈ వరసలో మహేష్ బాబు కూడా చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమాలో తెరకెక్కబోతున్న సినిమాలో ఆర్మీ మేజర్ గా కనిపించబోతున్నాడు మహేష్ బాబు. అంచనాలు నిజమైతే మహేష్ బాబు కూడా సినిమాలో ఆర్మీ రిలేటెడ్ సన్నివేశాల కోసం కాశ్మీర్ కి వెళ్ళే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి.

అవి వార్ సీక్వెన్సెస్ అయినా, మిలిటరీ బ్యాక్ డ్రాప్ లో ఉండే సింపుల్ సన్నివేశాలైనా కాశ్మీర్ కి వెళ్తేనే కాశ్మీర్ కి వెళ్తేనే కంఫర్టబుల్ అని ఫీలవుతున్నారు మేకర్స్.