ఫుల్ బిజీ అంటున్న Rakul Preeth

Thursday,November 26,2020 - 10:12 by Z_CLU

Rakul Preet Singh చేతిలో పెద్దగా సినిమాలు లేవని, ఆమె కేవలం తెలుగులో రెండు సినిమాలు మాత్రమే చేస్తుందని ఓ ప్రచారం జరుగుతుంది. దీంతో రకుల్ చేయబోయే సినిమాల లిస్టు బయట పెట్టారు ఆమె టీం. ప్రస్తుతం రకుల్ నితిన్ ‘చెక్’ సినిమాతో పాటు వైష్ణవ్ తేజ్ -క్రిష్ సినిమా కూడా చేస్తుందని ఈ రెండు కాకుండా తమిళ్ లో శివ కార్తికేయన్ తో మరో సినిమా చేస్తుందని అలాగే బాలీవుడ్ మూడు సినిమాలు పైప్ లైన్ లో ఉన్నాయని తెలిపారు.

బాలీవుడ్ లో అర్జున్ కపూర్ తో ఒకటి, జాన్ అబ్రహం హీరోగా చేస్తున్న ‘ఎటాక్’ సినిమా మరొకటి కాగా అమితాబ్ బచ్చన్,అజయ్ దేవగన్ కలిసి నటిస్తున్న ‘May Day’ అనే సినిమా కూడా చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఉన్నపళంగా రకుల్ టీం ఇచ్చిన  డీటెయిల్స్ తో పంజాబీ ముద్దుగుమ్మ చేతిలో ఇన్ని సినిమాలున్నాయా అంటూ షాక్ అవుతున్నారు ఆమె ఫ్యాన్స్. ఏదేమైనా ఇలా మూడు భాషల్లో బిజీగా ఉన్న హీరోయిన్ కాళీగా ఉందని చెప్తుండటం ఆమె టీంకి కోపం తెప్పించింది. అందుకే చేస్తున్న సినిమాలతో పాటు చేయబోయే సినిమాల లిస్టు కూడా బయటపెట్టి రకుల్ ఫుల్ బిజీ అంటూ తెలియజేశారు.

Also Check మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తున్న రకుల్