రానా ద‌గ్గుబాటి 'విరాట‌ప‌ర్వం' ప్రారంభం

Saturday,June 15,2019 - 02:33 by Z_CLU

రానా ద‌గ్గ‌బాటి, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తున్న  ‘విరాట‌ప‌ర్వం’ సినిమా లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి విక్ట‌రీ వెంక‌టేశ్ క్లాప్ కొట్ట‌గా, ఎమ్మెల్యే గొట్టిపాటి  ర‌వి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. నిర్మాతలు డి.సురేష్ బాబు, సుధాక‌ర్ చెరుకూరి ద‌ర్శ‌కుడు వేణు ఊడుగుల‌కి స్క్రిప్ట్‌ను అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో రానా ద‌గ్గుబాటి, సాయిప‌ల్ల‌వి పాల్గొన్నారు.

వ‌చ్చే వారం నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుగుతుంది. వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతాన్ని, దివాక‌ర్ మ‌ణి సినిమాటోగ్ర‌ఫీని అందిస్తున్నారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్‌.ఎల్‌.పి ప‌తాకాల‌పై సురేష్ బాబు, సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

న‌టీనటులు: రానా ద‌గ్గుబాటి, సాయిప‌ల్ల‌వి త‌దిత‌రులు
సాంకేతిక వ‌ర్గం:
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  వేణు ఊడుగుల‌
నిర్మాణ సంస్థ‌లు:  సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్‌.ఎల్‌.పి
నిర్మాత‌లు:  సురేష్ బాబు, సుధాక‌ర్ చెరుకూరి
సినిమాటోగ్ర‌ఫీ:  దివాక‌ర్ మ‌ణి
మ్యూజిక్:  సురేష్ బొబ్బిలి
ఆర్ట్‌:  నాగేంద్ర‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: ల‌క్ష్మ‌ణ్ ఏలే
ప‌బ్లిసిటీ డిజైన్‌:ధ‌ని ఏలే