రకుల్ ప్రీత్ సింగ్ – జస్ట్ హీరోయిన్ కాదు

Friday,September 27,2019 - 09:02 by Z_CLU

రకుల్ ప్రీత్ సింగ్… ఆల్మోస్ట్ ఇటు టాలీవుడ్ నుండి అటు బాలీవుడ్ వరకు అన్ని లాంగ్వేజెస్ లో పరిచయం అవసరం లేని స్టార్ హీరోయిన్. హీరోయిన్ గా ఓ టైమ్ లో నంబర్ 1 ప్లేస్ ని కూడా లీడ్ చేసింది. సౌత్ ఇండియన్ సినిమాలో ఆల్మోస్ట్ అందరు స్టార్ హీరోస్ తో జత కట్టేసింది. అయితే గమనిస్తే రకుల్ తన యాక్టింగ్ కరియర్ కొత్త ఫేజ్ స్టార్ట్ చేసినట్టనిపిస్తుంది. జస్ట్ హీరోయిన్ గానే కాదు ఇంపాక్ట్ క్రియేట్ చేసేటట్టు ఉండాలే సినిమాలో చిన్న క్యారెక్టర్ చేయడానికి కూడా రెడీ అంటుంది.

సిద్ధార్థ్ మల్హోత్రా ‘మర్ జావా’ సినిమాలో నటిస్తుంది రకుల్ ప్రీత్ సింగ్. అయితే ఈ సినిమా హీరోయిన్ తారా సుతారియా. రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తుంది. దీనికి సంబంధించిన డీటేల్స్ ఇంకా రివీల్ కాలేదు కానీ, రకుల్ తన కరియర్ లోనే ఇలాంటి క్యారెక్టర్ లో ఇంతవరకు నటించాలేదని చాలా ఎగ్జైటెడ్ గా ఉంది.

సిద్ధార్థ్ మల్హోత్రా సరసన గతంలో ‘అయ్యారి’ సినిమాలో నటించారు. ఇకపోతే ‘మర్ జావా’ సినిమాలో రకుల్ ప్రీత్ మాస్ క్యారెక్టర్ లో కనిపించనుందని తెలుస్తుంది. పర్ఫామెన్స్ కి చాలా స్కోప్ ఉన్న క్యారెక్టర్ కాబట్టే ఈ సినిమాను ఒప్పుకున్నట్టు తెలుస్తుంది.

చూడాలి మరీ.. క్యారెక్టర్ వినగానే నచ్చేసింది కాబట్టి ఈ సినిమాలో క్యారెక్టర్ ప్లే చేస్తుందా..? లేకపోతే ఫ్యూచర్ లో కూడా ఇలాంటి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ని కంటిన్యూ చేస్తుందా..? చూడాలి.