రకుల్ కూడా అదే తప్పు రిపీట్ చేస్తుందా..?

Saturday,November 09,2019 - 10:02 by Z_CLU

రకుల్ ప్రీత్ సింగ్… గతంలో ఇలియానా, శృతి హాసన్ చేసిన తప్పునే చేయనుందా..? రీసెంట్ గా ‘మన్మధుడు 2’ లో కనిపించి ఆ తరవాత మరో తెలుగు సినిమాకి సంతకం చేయలేదు రకుల్. కంప్లీట్ ఫోకస్ బాలీవుడ్, కోలీవుడ్ సినిమాపైనే పెట్టింది. మరి తెలుగు సినిమా కరియర్ గురించి ఏం ప్లాన్స్ చేస్తుంది…?

ఇదే తప్పు ఒకప్పుడు ఇలియానా చేసింది. టోటల్ గా తెలుగు సినిమాలు చేయకూడదు అనే డెసిషన్ తీసుకోలేదు కానీ, బాలీవుడ్ లో బిజీ అయ్యేసరికి, చిన్నగా తెలుగు సినిమాకి ప్రయారిటీ ఇవ్వలేకపోయింది. ఈ లోపు జరగాల్సింది జరిగిపోయింది. ఇలియానా ఏ స్థాయిలో తెలుగు ఆడియెన్స్ లో క్రేజ్ క్రియేట్ చేసుకుందో అంతే ఈజీగా కనుమరుగైపోయింది. మొన్నా మధ్య ‘అమర్ అక్బర్ ఆంటోని’ తో పలకరించినా పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు.

 

అపుడెప్పుడో 2017 లో ‘కాటమరాయుడు’ లో కనిపించింది శృతి హాసన్. ఆ తర్వాత సింగర్ గా కరియర్ పై ఫోకస్ పెట్టి తెలుగు సినిమాలో కనిపిస్తుందో లేదో అన్నంతగా గ్యాప్ క్రియేట్ చేసుకుంది. ఇప్పుడు మళ్ళీ రవితేజ సినిమాతో రీఎంట్రీ కి శృతి సిద్ధంగా ఉన్నా, ఆడియెన్స్ లో ఇంకా తనకు అదే స్థాయి క్రేజ్ ఉందా..? అంటే క్వశ్చన్ మార్కే…

వరస చూస్తుంటే రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఇలాగే గాడి తప్పనుందనిపిస్తుంది. బాలీవుడ్ లో బిజీగా ఉంది. ఇటు కోలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తున్నాననిపించుకుంటుంది. కానీ వీటి మధ్య తెలుగు సినిమా కోసం స్పేస్ క్రియేట్ చేసుకోలేకపోతుంది. అక్కడ బిజీగా ఉంది కాబట్టి పరవాలేదు… కానీ ఈలోపు తెలుగు సినిమా ఫ్యాన్స్ తో కనెక్టివిటీ మిస్సయితే మళ్ళీ అదే క్రేజ్ ని దక్కించుకోవడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అవుతుంది. మరి ఈ విషయం రకుల్ గమనిస్తుందో… లేదో..