శ్రీరామనవమి స్పెషల్

Wednesday,April 05,2017 - 02:00 by Z_CLU

ఏదైనా పండుగొచ్చిందంటే టాలీవుడ్ స్టార్ హీరోలు తమ సినిమా పోస్టర్స్ తో ప్రేక్షకులకు శుభాకాంక్షలు చెప్పడం  మామూలే. మరి ‘శ్రీరామనవమి’ ను పురస్కరించుకొని తమ అప్ కమింగ్ సినిమా ఫస్ట్ లుక్, పోస్టర్స్ తో ప్రేక్షకులకు  శుభాకాంక్షలు చెప్పిన హీరోలెవరో చూద్దాం…

 

 

ముందుగా శ్రీరామనవమి సందర్భంగా తన అప్ కమింగ్ సినిమా టైటిల్ లోగో ను రిలీజ్ చేసి పండగ సంతోషాన్ని అభిమానుల్లో మరింత రెట్టింపు చేశాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం బాబీ దర్శకత్వం లో కళ్యాణ్ రామ్ నిర్మాతగా తెరకెక్కుతున్న సినిమాకు ‘జై లవ కుశ’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసిన తారక్ ఆ టైటిల్ ను అనౌన్స్ చేయడానికి శ్రీరామనవమి పండగే పర్ఫెక్ట్ అని భావించి సోషల్ మీడియా ద్వారా ‘జై లవ కుశ’ టైటిల్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశాడు..

 


శ్రీరామనవమి సందర్భంగా గోపీచంద్ కూడా సంపత్ నంది డైరెక్షన్ లో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న తన అప్ కమింగ్ మూవీ ‘గౌతమ్ నంద’ కు సంబంధించిన లేటెస్ట్ పోస్టర్ తో ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపాడు.

 

ప్రెజెంట్ వరుస హిట్స్ తో దూసుకుపోతున్నయంగ్ హీరో శర్వానంద్ కూడా తన లేటెస్ట్ సినిమా ‘రాధా’ పోస్టర్ తో ప్రేక్షలుకలకు శుభాకాంక్షలు చెప్తూ త్వరలోనే థియేటర్స్ లో సందడి చేయడానికి వస్తున్న అని చెప్పకనే చెప్పాడు…

 

కార్తీ కూడా తన లేటెస్ట్ మూవీ ‘చెలియా’ పోస్టర్స్ తో శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్తూనే ఏప్రిల్ 7న తన లవ్ స్టోరీ తో థియేటర్స్ లో ఎంటర్టైన్ చేయబోతున్న అంటూ తెలిపాడు..

 

‘స‌రైనోడు’ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రంతో వైరం ధ‌నుష్ గా అందరినీ మెప్పించిన ఆది పినిశెట్టి కూడా తన లేటెస్ట్ సినిమా “మ‌ర‌క‌త‌మ‌ణి” మోషన్ పోస్టర్ తో ఆడియన్స్ కు శుభాకాంక్షలు తెలిపాడు.. తమిళ్, తెలుగు భాష‌ల్లో ఒకే సారి స‌మ్మ‌ర్ స్పెషల్ గా రిలీజ్ కానున్న ఈ సినిమాతో హీరోగా మరో సారి ఆడియన్స్ ఎంటర్టైన్ చేయాలనీ చూస్తున్నాడు ఆది.