ఫ్రైడే రిలీజ్

Wednesday,April 05,2017 - 03:05 by Z_CLU

ఎవ్రీ ఫ్రై డే లాగే ఈ ఫ్రైడే కూడా కలర్ ఫుల్ సినిమాలతో సరికొత్తగా ఎంటర్ టైన్ చేయడానికి ఎగ్జైటెడ్ గా ఉంది. బాక్సాఫీస్ రెడీఫర్ రిలీజ్ సినిమాలతో ఆల్ సెట్ అయిపోయింది. వాటిలో కొన్ని డైరెక్ట్ తెలుగు సినిమాలైతే మరోకిన్ని డబ్బింగ్ సినిమాలు. ఏది ఏమైనా ఈ సారి బాక్సాఫీస్ అన్ని జోనర్స్ తో ఫుల్లీ లోడెడ్ జోష్ తో రెడీ అయిపోయింది.

మణిరత్నం డైరెక్షన్ లో తెరకెక్కిన అల్టిమేట్ లవ్ ఎంటర్ టైనర్ చెలియా. కార్తీ, ఆదితి రావ్ హైదరి జంటగా నటించిన ఈ సినిమాకి A.R. రెహ్మాన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఆల్ రెడీ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ అనే టాక్ ని బ్యాగ్ లో వేసుకున్న ఈ సినిమా, ఏప్రిల్ 7 న వరల్డ్ వైడ్ గా రిలీజవుతుంది.

జీవా, కాజల్ అగర్వాల్ జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ ‘కవలై వేండం’ తెలుగులో ‘ఎంతవరకు ఈ ప్రేమ’ టైటిల్ తో రిలీజవుతుంది. ఈ సినిమాకి DK డైరెక్టర్.

నవీన్ సంజయ్, తనిష్క్ తివారి జంటగా నటించిన శరణం గచ్చామి ప్రేమరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కింది. డిఫెరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి రవికళ్యాణ్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. బొమ్మకు మురళి ప్రొడ్యూసర్.

అర్జున్ మహి, అశ్విని జంటగా నటించిన ‘నువ్వు నేను ఒసేయ్ ఒరేయ్’ కన్నికంటి రవిచంద్ర డైరెక్షన్ లో తెరకెక్కింది. సుమన్ జూపూడి ఈ సినిమాకి డైరెక్టర్.

ఆర్య హీరోగా తెరకెక్కిన మండే సూర్యుడు కూడా ఈ ఫ్రైడే రిలీజవుతుంది. హన్సిక మోత్వాని హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి మగిల్ తిరుమేని డైరెక్టర్. తమన్ మ్యూజిక్ కంపోజర్.

ఈ సినిమాలతో పాటు హాలీవుడ్ సినిమా గార్డియన్స్ ( తెలుగు డబ్బింగ్), చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే, కత్రినా- కరీనా మధ్యలో కమల్ హాసన్ కూడా ఈ ఫ్రైడే సందడి చేయనున్నాయి.