నారా రోహిత్ కరియర్ లో మరో బాణం

Wednesday,April 05,2017 - 12:50 by Z_CLU

ప్రస్తుతం కథలో రాజకుమారి సినిమాతో సెట్స్ పై ఉన్నాడు నారా రోహిత్. ఈ సినిమా తర్వాత ఇమ్మీడియట్ గా ‘పండగలా వచ్చాడు’ సినిమాతో బిజీ కానున్న ఈ హీరో తన సినిమా కరియర్ బిగిన్ చేసిన డైరెక్టర్ చైతన్య దంతులూరి తో మరో సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.

బాణం తరవాత ‘బసంతి’ సినిమా చేసిన చైతన్య దంతులూరి ఆ తర్వాత మరే హీరోతో సినిమా అనౌన్స్ చేయలేదు. అంతలో బాణం లాంటి డిఫెరెంట్ సినిమాతో ఎంటర్ టైన్ చేసిన ఈ కాంబో, మరోసారి సెట్స్ పైకి రానుందనే టాక్, ఫిలిం నగర్ స్ట్రీట్స్ లో స్పెషల్ ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తుంది. ఈ విషయంలో ఇప్పటి వరకు అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు కానీ అల్టిమేట్ పొలిటికల్ థ్రిల్లర్ కి ఆల్ రెడీ గ్రౌండ్ వర్క్ బిగిన్ అయిందనే టాక్ నారా రోహిత్ ఫ్యాన్స్ లో డిస్కషన్స్ కి స్పేస్ క్రియేట్ చేస్తుంది.