షూటింగ్ అప్ డేట్స్

Sunday,June 30,2019 - 11:02 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో కొన్ని సినిమాలు జెట్ స్పీడులో షూటింగ్ జరుపుకుంటుండగా మరి కొన్ని సినిమాలు త్వరలోనే సెట్స్ పైకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. బిజీ బిజీ షెడ్యూల్స్ తో, ఇంటరెస్టింగ్ కంటెంట్ తో తెరకెక్కుతున్న సినిమాల షూటింగ్ అప్ డేట్స్ మీ కోసం.


రవితేజ హీరోగా… వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డిస్కో రాజా’  సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. రవి తేజ అలాగే మిగతా నటీ నటులపై కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.


అల్లు అరవింద్ సమర్పణలో సాయి తేజ్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ప్రతి రోజు పండుగే’ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ప్రస్తుతం సాయి ధరం తేజ్ , ప్రవీణ్, సుహాస్ లపై కొన్ని కామెడీ సన్నివేశాలు షూట్ చేస్తున్నారు.


అఖిల్ అక్కినేని హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ జులై 3 నుంచి హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్  బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ , వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న  ‘సైలెన్స్’ సినిమా రెగ్యులర్ షూటింగ్ అమెరికాలోని సియాటిల్ లో జరుగుతోంది. ఈ సినిమాలో మాధవన్ , అంజలి,షాలిని పాండే  ముఖ్య మైన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్ బ్యానర్స్ పై విశ్వప్రసాద్ , కోనా వెంకట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్‌లో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ‘ఉప్పెన’ సినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగుతుంది.  కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న  ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నాడు.

ఓక్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ఓంకార్ స్వీయ దర్శకత్వంలో అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘రాజుగారి గ‌ది 3’ రెగ్యులర్ షూటింగ్ సారధి స్టూడియోలో జరుగుతుంది.