జీ ఎక్స్ క్లూజీవ్ : ఆనంద్ దేవరకొండ...రెండో సినిమా అదే !

Sunday,June 30,2019 - 12:12 by Z_CLU

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ‘దొరసాని’ సినిమాతో హీరోగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జులైలో థియేటర్స్ లోకి రాబోతోంది. అయితే మొదటి సినిమా రిలీజ్ కాకముందే మరో సినిమా ఫైనల్ చేసుకున్నాడు ఆనంద్. వినోద్ అనే కొత్త దర్శకుడితో నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడు.

యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాను భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా జులైలో లాంచ్ కానుందని సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.