Nani Dasara Movie: దసరా మూవీ షూటింగ్ అప్ డేట్

Monday,January 16,2023 - 03:40 by Z_CLU

Nani’s Dasara Movie Shooting Updates

నేచురల్ స్టార్ నాని (Hero Nani) మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా చిత్రం ‘దసరా’ మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్ మెటీరియల్‌కి మంచి ఆదరణ లభించింది. ముఖ్యంగా ధూమ్ ధామ్ పాటకు అద్భుతమైన స్పందన వచ్చింది.

తాజాగా ఈ సినిమా (Dasara Movie Shooting) షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ పూర్తి కావడంతో చిత్రబృందం ప్రమోషన్స్ ని దూకుడుగా చేస్తోంది.

ఈ సినిమాలో నానికి జోడిగా కీర్తి సురేష్ (Keerthy Suresh) కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలో తన లుక్‌ అందరినీ ఆశ్చర్యపరిచింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నాడు. సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడు. దసరా చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics