శతమానంభవతి చిత్రాన్ని మెచ్చుకున్న మెగాస్టార్

Monday,April 17,2017 - 12:41 by Z_CLU

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన శతమానంభవతి చిత్రానికి జాతీయ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆ చిత్ర నిర్మాత దిల్ రాజును కొంతమంది సీనిప్రముఖులు ప్రత్యేకంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. దిల్ రాజును ప్రత్యేకంగా అభినందించారు. శతమానంభవతి లాంటి సినిమాలు ఈ తరానికి చాలా అవసరం అన్నారు చిరు.

హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు నిర్మాత‌గా శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై నిర్మించిన `శ‌త‌మానంభ‌వ‌తి` సినిమాకు జాతీయ అవార్డు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. 27ఏళ్ళ త‌ర్వాత ఓ తెలుగు సినిమాకు జాతీయ అవార్డు రావడం ఇదే ఫస్ట్ టైం. గీతాంజ‌లి, శంక‌రాభ‌ర‌ణం చిత్రాల త‌ర్వాత ఈ ఘ‌న‌త సాధించిన తెలుగు చిత్రం `శ‌త‌మానం భ‌వ‌తి`.

చ‌క్క‌టి కుటుంబ క‌థా చిత్రంతో తెలుగువారి సంప్ర‌దాయాల‌ను, సంస్కృతి, బంధాల‌ను తెలియ‌జెప్పిన శ‌త‌మానం భ‌వ‌తి చిత్రాన్నినిర్మించిన దిల్‌రాజును అల్లు అకాడ‌మీ ఆఫ్ ఆర్ట్స్ సంస్థ త‌ర‌పున ప్ర‌ముఖ నిర్మాత అల్లుఅర‌వింద్ స‌న్మానించారు. ఈ కార్య‌క్ర‌మానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు.

శతమానంభవతి సినిమాకు సంబంధించి అన్నీ చ‌కచ‌కా జ‌రిగిపోయాయి. 45 రోజుల్లో షూటింగ్ పూర్తి కావ‌డం, 20-30 రోజుల్లోనే పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పూర్తి కావ‌డం వెంటనే సంక్రాంతికి విడుదలకావడం ఫాస్ట్ గా జరిగిపోయాయి. శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఉగాది కానుకగా జీ తెలుగులో ప్రసారమైన ఈ సినిమా, టీఆర్పీల్లో కూడా సంచలనం సృష్టించింది.