మరో సినిమాతో ముస్తాబైన సందీప్ కిషన్

Monday,April 17,2017 - 01:25 by Z_CLU

సందీప్‌ కిషన్‌, లావణ్య త్రిపాఠి, జాకీష్రాఫ్‌ ప్రధాన పాత్రల్లో సి.వి. కుమార్‌ దర్శకత్వంలో తమిళ్‌లో తెరకెక్కిన ‘మాయావన్‌’ సినిమా తెలుగులోకి రాబోతోంది. ఎస్‌బికె ఫిలింస్‌ కార్పోరేషన్‌పై ఈ సినిమాను తెలుగులో తీసుకొస్తున్నారు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు తెలుగు టైటిల్ ఫిక్స్ చేయలేదు.

ప్రస్తుతం ఓ సాంగ్‌కి సంబంధించి చిన్న ప్యాచ్‌ వర్క్‌ జరుగుతోంది. ఇది ఏప్రిల్‌ 27 వరకు కోడైకెనాల్‌, చెన్నయ్‌లలో జరుగుతుంది. ఆ వెంటనే ఆడియోని రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి తెలుగు టైటిల్‌ను, ఇతరత్రా విషయాలను అతి త్వరలో తెలియజేస్తారు.

రీసెంట్ గా సందీప్ కిషన్ నటించిన నగరం చిత్రానికి తెలుగులో మంచి టాక్ వచ్చింది. దీంతో మాయావన్ పై కూడా ఓ మోస్తరు అంచనాలు పెరిగాయి.