మరికొన్ని గంటల్లో "అమీ తుమీ" టీజర్ రిలీజ్

Monday,April 17,2017 - 11:35 by Z_CLU

ఈరోజు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ పుట్టినరోజు. ఈ సందర్భంగా అతడు డైరక్ట్ చేస్తున్న “అమీ తుమీ” సినిమా టీజర్ ను లాంచ్ చేయబోతున్నారు. ఇప్పటికే టైటిల్ తో బోలెడంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అమీతుమీ సినిమా. ఈ మూవీ ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే ఊపులో ఇప్పుడు టీజర్ లాంచ్ చేయబోతున్నారు.

పుట్టినరోజు ఇంద్రగంటిదే అయినా, టీజర్ లాంచ్ చేసేది మాత్రం అతను కాదు. ఇంద్రగంటి ఫేవరెట్ ఆర్టిస్ట్ నాని, ఈ సినిమా టీజర్ లాంచ్ చేయబోతున్నాడు. సరిగ్గా ఈరోజు సాయంత్రం 6గంటల 30నిమిషాలకు అమీతుమీ టీజర్.. నాని చేతుల మీదుగా లాంచ్ కానుంది.

గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో అవసరాల శ్రీనివాస్, అడివి శేషు, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈషా, అదితి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీత దర్శకుడు. రికార్డు స్థాయిలో జస్ట్ 31 రోజుల్లో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేశారు.