శతమానంభవతి ఇంప్రెసివ్ కలెక్షన్స్

Sunday,January 15,2017 - 08:33 by Z_CLU

బడా బడా సినిమాలతో పాటు సంక్రాంతి బరిలోకి దిగిన శతమానం భవతి, అంత కాంపిటీషన్ లోను తన స్పెషాలిటీని రిజిస్టర్ చేయడంలో సూపర్ సక్సెస్ అయింది. అల్టిమేట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లా తెరకెక్కిన ‘శతమానం భవతి’ పాజిటివ్ రివ్యూస్ తో కలెక్షన్ ల వర్షం కురిపిస్తుంది.

రిలీజైన ఫస్ట్ డే ఆంధ్రా, నైజాం, సీడెడ్ ఏరియాల్లో ఏకంగా 3.03 కోట్లు వసూలు చేసిన శతమానంభవతి, US లో $122,407 వసూలు చేసి ట్రేడర్స్ ని కూడా ఇంప్రెస్ చేసేసింది.

శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, జయసుధ, ప్రకాష్ రాజ్ కాంబో… అల్టిమేట్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో తెరకెక్కిన శతమానం భవతి అటు యూత్ ని, ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఇంప్రెస్ చేసి, సూపర్ హిట్ ట్యాగ్ తో దూసుకుపోతుంది.