సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరు@151

Sunday,January 15,2017 - 12:40 by Z_CLU

గోల్డెన్ ఛాన్స్ కు ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు సురేందర్ రెడ్డి. అన్నీ అనుకున్నట్టు జరిగితే చిరంజీవి 151వ సినిమాకు సురేందర్ రెడ్డి డైరక్ట్ చేసే అవకాశం ఉంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ దర్శకుడు చిరు 151వ సినిమా కోసం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ కూడాా స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. చిరంజీవితో 150వ సినిమాను నిర్మించిన రామ్ చరణ్… 151వ సినిమాకు కూడా నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు. ఈ విషయాన్ని ఇటు రామ్ చరణ్, అటు అల్లు అరవింద్ ఇద్దరూ స్పష్టం చేశారు. అయితే దర్శకుడు ఎవరనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు

చిరంజీవి 151వ సినిమా దర్శకుల జాబితాలో బోయపాాటిశ్రీను, సురేందర్ రెడ్డి, పూరి జగన్నాధ్ లాంటి దర్శకుల పేర్లు వినిపించాయి. ఫైనల్ గా ఆ అవకాశం సురేందర్ రెడ్డికి దక్కే అవకాశాలున్నాయి. రీసెంట్ గా చెర్రీతో ధృవ సినిమాను తెరకెక్కించిన సురేందర్ రెడ్డి.. ఆ సినిమా సెట్స్ పై ఉంటుండగానే మెగాస్టార్ కు ఓ అదిరిపోయే స్టోరీలైన్ వినిపించిన సంగతి తెలిసిందే. ఆ కథకే చిరు ఓకే చెప్పే ఛాన్సెస్ ఉన్నాయి.