శతమానంభవతికి అరుదైన ఘనత
Wednesday,February 01,2017 - 02:03 by Z_CLU
ఈ సారి సంక్రాంతికి సిసలైన సంబరం రిలీజయిందా అనిపించేలా తెరకెక్కిన శతమానం భవతి బడా బడా సినిమాల మధ్య కూడా తనదైన ఉనికిని చాటుకోవడంలో సక్సెస్ అయింది. బాక్సాఫీస్ బరువును పెంచడంలోనూ సక్సీడ్ అయిన శతమానం భవతి, మరో అరుదైన ఘనత సాధించింది.
ప్రపంచంలోనే అత్యంత గౌరవప్రదమైన ఆస్కార్ అకాడమీ ఈ సినిమాకి సంబంధించిన మెటీరియల్ ని సబ్ మిట్ చేయమని అడిగింది. స్క్రిప్ట్ దగ్గరి నుండి పబ్లిసిటీ మెటీరియల్ వరకు సినిమా సక్సెస్ కి కారణమైన ప్రతి ఎలిమెంట్ ని తన లైబ్రరీలో ఉంచనుంది ఆస్కార్ అకాడమీ. ఈ విషయంలో ఇప్పటికే ఫిలిం మేకర్స్ తో సంప్రదింపులు జరుగుతున్నాయి.

ఫ్యామిలీ వ్యాల్యూస్, సాంప్రదాయాలు ఇవే శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన శతమానం భవతిలో మెయిన్ ఎలిమెంట్స్. రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఫ్యూచర్ సినిమాలకు కూడా ఇన్స్ పిరేషన్ కానుంది.