శతమానం భవతి వీకెండ్ కలెక్షన్స్

Tuesday,January 17,2017 - 01:30 by Z_CLU

పండక్కి రిలీజయిందా..? పండగే రిలీజయిందా అనిపిస్తున్న ‘శతమానం భవతి’ ఇంత హెవీ కాంపిటీషన్ లోను ఫ్యామిలీ ఆడియెన్స్ ని థియేటర్ వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయింది. జనవరి 14 న రిలీజ్ అయిన శతమానం భవతి 3 రోజుల్లో 10.5 కోట్లు వసూలు చేసి.. పండగ సీజన్ లో పర్ ఫెక్ట్ ఇంగ్రీడియంట్ అనిపించుకుంది.

కథ పాతదే అయినా సరికొత్త స్క్రీన్ ప్లే తో, ఏ మాత్రం బోరింగ్ ఎలిమెంట్స్ లేకుండా తెరకెక్కిన శతమానం భవతి ఓపెనింగ్సే కాదు, రిపీటెడ్ ఆడియెన్స్ ని కూడా క్రియేట్ చేసుకుంది. స్టోరీలో ఇన్వాల్వ్ అయినట్టుగా సాగే కామెడీ ఎలిమెంట్స్, ఇమోషనల్ సీన్స్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.